Site icon Prime9

Chiranjeevi: విమానంలో చిరంజీవి దంపతుల పెళ్లి రోజు వేడుక – పోస్ట్‌ వైరల్‌!

Chiranjeevi and Surekha Wedding Anniversary: మెగాస్టార్‌ చిరంజీవి, సురేఖ దంపతుల పెళ్లి రోజు నేడు. వారి వివాహా వార్షికోత్సవాన్ని చిరంజీవి దంపతులు విమానంలో సింపుల్‌గా సెలబ్రేట్‌ చేశారు. టాలీవుడ్‌ కింగ్ నాగార్జున, అమల దంపతులు, మహేష్‌ బాబు సతీమణి నమ్రత శిరొద్కర్‌తో పాటు సన్నిహితులతో కలిసి చిరంజీవి దంపతులు ప్రత్యేక విమానంలో దుబాయ్‌ వెళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు(ఫిబ్రవరి 20) వారి పెళ్లి రోజు సందర్భంగా వారికి పూల బొకే ఇచ్చి విషెస్‌ తెలిపారు.

ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలను చిరంజీవి తన సోషల్‌ మీడియాలో ఖాతాలో షేర్‌ చేశారు. “దుబాయ్‌ వెళ్తున్న కొంతమంది స్నేహితులు, సన్నిహితులతో విమానంలో వెళ్తూ మా పెళ్లి రోజును జరుపుకున్నాం. “నా కలల జీవిత భాగవస్వామిగా సురేఖ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆమె నా బలం, మై హ్యాండ్‌ బెనీత్‌. ఆమె ఉనికి నిరంతరం ఓదార్పునిస్తుంది. నా అద్భుతమైన మోటివెటర్‌. సురేఖ అంటే ఏంటో చెప్పుకునేందుకు ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నాను. నా ఆత్మ సహచరుడికి ధన్యవాదాలు-సురేఖ” అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ఇది తెలిసి మెగా అభిమానులంతా చిరంజీవి, సురేఖలకు పెళ్లి రోజులు శుభకాంక్షలు తెలుపుతున్నారు. ఆదర్శ దంపతులు అంటూ ఈ జంటను కొనియాడుతున్నారు.

Exit mobile version
Skip to toolbar