Jr NTR Dubbing to Chhaava Telugu Version: ‘ఛావా’.. ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్‌ని ఏలేస్తోంది. మొన్నటి వరకు ‘పుష్ప 2’ కలెక్షన్స్‌తో సునామీ సృష్టించింది. ఇప్పుడు ఛావా ఆ రేంజ్‌లో సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 500పైగా కోట్లు వసూళ్లు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. ఛత్రపతి శంభాజీ జీవిత కథ ఆధారంగా హిస్టారికల్ చిత్రంగా రూపొందింది.
కేవలం హిందీలో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ పొందుతుంది. ఈ సినిమా హిట్ టాక్ రావడం, ఇందులో ఛత్రపతి శివాజీ తనయుడి అజేయమైన స్ఫూర్తిని తెలియజేయడంతో సౌత్ ఆడియన్స్ సైతం ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇది కేవలం హిందీలోనే రిలీజ్ అవ్వడంతో చాలా మంది నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఛావా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ రిలీజ్ చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్స్ వచ్చాయి. నెట్టింట ఛావాకు వస్తున్న రెస్పాన్స్, ఆడియన్స్ డిమాండ్స్ మేరకు ఛావాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.
మార్చి 7న తెలుగులో
ఈ మూవీ తెలుగు రైట్స్‌ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తీసుకుంది. ఈ మేరకు మార్చి 7న ఛావా మూవీని థియేటర్లోకి తీసుకువస్తున్నారు. దీనిపై ప్రకటన రావడంతో ‘ఛావా’కు లీడ్ రోల్ విక్కీ కౌశల్ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ చెబుతున్నట్టు వార్తలు వినిపంచాయి. దీంతో మూవీపై మరింత బజ్ క్రియేట్ అయ్యింది. దీనిపై మూవీ టీం, మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన లేదు. దీంతో ఆడియన్స్ డైలామాలో పడ్డారు. ఇక ఇదే విషయాన్ని ఛావా ప్రెస్‌మీట్‌లో నిర్మాత బన్నీవాసును ప్రశ్నించారు ఓ విలేఖరి. దీనికి ఆయన స్పందిస్తూ అసలు విషయం చెప్పారు.
ఎన్టీఆర్ వాయిస్ ఓవర్?
“ఛావాకు ఎన్టీఆర్ డబ్బింగ్ చెబుతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అవి నేను చూశాను. అది చూసి నేను షాకయ్యా. ప్రస్తుతం ఎన్టీఆర్ గారు చాలా బిజీగా ఉన్నారు. వార్ 2 షూటింగ్‌లో ఉన్నారు. ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా అది కుదరదు. ఈ విషయమై కనీసం మేము చర్చించలేదు కూడా. ఫుల్ బిజీ ఉన్న ఆయనతో డబ్బింగ్ చెప్పించాలనే ఆలోచన కూడా మేము చేయలేదు. మరీ ఈ వార్తలు ఎలా వచ్చాయన్నది నాకు కూడా తెలియదు. కానీ ఛావాకు ఆయన డబ్బింగ్ చెప్పారంటూ వస్తున్న వార్తల్లో మాత్రం నిజం లేదు” అని బన్నీ వాసు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ పుకార్లు ఫుల్‌స్టాప్ పడినట్టు అయ్యింది.