Boyapati Srinu About Maha Kumbha Mela: నందమూరి బాలకృష్ణ హీరోగా భోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. 2021 విడుదలైన అఖండ చిత్రానికి ఇది సీక్వెల్. ఇటీవల పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. అఘోర నేపథ్యంలో అఖండ 2 సినిమా ఉండనుంది. ఈ నేపథ్యంలో సినిమాను కొత్త షెడ్యూల్ ను మహా కుంభమేళాలో ప్లాన్ చేశామన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమమైన ఈ మహా కుంభమేళాలో అఖండ 2 టీం సందడి చేయడం విశేషం. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడారు.
మహా కుంభమేళాలో ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. ‘కుంభమేళ ఏర్పాట్లు బాగా చేశారు. ఈ విషయాన్ని నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అఖండ 2 షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాం. మా అఘోరా నేపథ్యంలో సాగనుంది. అందుకే సినిమాలోని కొన్ని సీన్స్ కోసం కుంభమేళాలో షూటింగ్ ప్లాన్ చేశాం. ఇక్కడికి జనవరి 11న వచ్చాం. ఈ రోజుతో ఇక్కడ షూటింగ్ పూర్తి అవుతుంది. కుంభమేళాకు వస్తున్న నాగసాధువులను, అఘోరాలను కలిశాను. మా ప్రయత్న లోపంగా అఖండ 2 సినిమా షూటింగ్ చేస్తున్నాం.
వేలమంద నాగసాధువులు, అఘోరాలు, కోట్ల మంది భక్తుల మధ్య అఖండ 2 షూటింగ్ జరగడం విశేషంగా బావిస్తున్నాం’ అని ఆయన అన్నారు. కాగా 2021 విడుదలైన అఖండ మూవీ ఎంత పెద్ద విజయం సాధించింది తెలిసిందే. అప్పుడే ఓ పెద్ద హిట్ కోసం చూస్తున్న బాలయ్యకు అఖండ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. దీంతో అఖండ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బోయపాటి కూడా అంచనాలను మించకుండ అఖండకు థీటుగా భారీ యాక్షన్, బలమైన కథ, కథనంలో అఖండను తీర్చిదిద్దుతున్నారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ ఏడాది దసరా సందర్భంగా సెప్టెంబర్ లో అఖండ 2 ని విడుదల చేసేందుకు మూవీ ప్లాన్ చేస్తుంది.