Devara 2: ఈమధ్యకాలంలో సీక్వెల్స్ ఎక్కువ అయిపోయాయి. హిట్, ప్లాప్ అనేది లేదు. ప్రతి సినిమాకు చివర్లో ఏదో ఒక లైన్ ను యాడ్ చేయడం సీక్వెల్ ఉందని చెప్పుకొచ్చేయడం. ఆ తరువాత సీక్వెల్ ఉంటుందా.. ? లేదా..? అనేది కూడా ఎవరికీ తెలియదు. అంతెందుకు.. సలార్ సీజ్ ఫైర్ అని ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా వచ్చింది. చివర్లో సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. శౌర్యంగ పర్వం అని టైటిల్ కూడా చెప్పుకొచ్చారు. కానీ, ఇప్పటివరకు ఈ సీక్వెల్ పట్టాలెక్కింది లేదు. ఇలా చాలా సినిమాలు సీక్వెల్ ఉంటుందో లేదో అనే కన్ఫ్యూషనే ఎక్కువగా ఉంటుంది. అలా కన్ఫ్యూషన్ లో ఉన్న సీక్వెల్ దేవర 2.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో వచ్చిన చిత్రం దేవర. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటించగా.. సైఫ్ ఆలీఖాన్ విలన్ గా కనిపించాడు.
దేవర సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. దానికి కారణాలు కూడా అప్పుడు చాలా ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించడం, ఆచార్య ప్లాప్ తరువాత కొరటాల దర్శకత్వం వహించడం.. ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ తరువాత ఈ సినిమా రావడం.. ఇలా చాలా కారణాలు ఉన్నాయి. ఎన్నో అంచనాల నడుమ గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా దేవర 2 వస్తుందని క్లైమాక్స్ లో చెప్పుకొచ్చారు.
Pelli Kani Prasad Teaser: పెళ్లి కానీ ప్రభాస్ రిలీజ్ చేసిన పెళ్లి కానీ ప్రసాద్ టీజర్ చూశారా..?
తాజాగా ఈ సినిమా గురించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం దేవర 2లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఒక కీలక పాత్ర కోసం తీసుకున్నట్లు చెప్పుకొస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తరువాత బాలీవుడ్ మార్కెట్ ను బాగా పెంచుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ తన మార్కెట్ తోనే వార్ 2 తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
ఇక ఇప్పుడు దేవర 2 కోసం రణ్వీర్ సింగ్ ను దింపితే మరింతగా ఎన్టీఆర్.. బాలీవుడ్ లో ఫేమస్ అవుతాడని, ఇలా ఆలోచించే కొరటాల ఈ విధంగా ప్లాన్ చేశాడని టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఎవరికి అంతుచిక్కని విషాయం ఏంటంటే.. దేవర 2 ఎప్పుడు మొదలవుతుంది. ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ తో డ్రాగన్.. బాలీవుడ్ డెబ్యూ వార్ 2 తోనే తలమునకలు అవుతున్నాడు.
దేవర సీక్వెల్ అని చెప్పడం తప్ప ఇప్పటివరకు దాని గురించిన ఒక ఊసు కూడా లేదు. ఈ సినిమా తరువాత కొరటాల అసలు కనిపించడమే మానేశాడు. ఆలు లేదు.. సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు.. అసలు ఉంటుందో.. ఉండదో తెలియదు.. మళ్లీ ఇందులో మరో కొత్త హీరోనా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.