Site icon Prime9

Anupam Kher: ‘ది వ్యాక్సిన్ వార్’ లో అనుపమ్ ఖేర్

Anupam Kher

Anupam Kher

Anupam Kher: దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ‘ది వ్యాక్సిన్ వార్’ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. ఇది అనుపమ్ ఖేర్ కు 534వ చిత్రం కావడం విశేషం.

అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో ‘ది వ్యాక్సిన్ వార్’ క్లాప్‌బోర్డ్‌తో పట్టుకున్న చిత్రాన్ని షేర్ చేసుకున్నారు. అతను “నా 534వ చిత్రాన్ని ప్రకటిస్తున్నాను!!! @vivekagnihotri దర్శకత్వం వహించిన #TheVaccineWar. మనోహరమైనది మరియు స్ఫూర్తిదాయకం! జై హింద్! అంటూ రాసారు. కొన్ని రోజుల క్రితం, నానా పటేకర్ పేరు ‘ది వ్యాక్సిన్ వార్’కి కథానాయకుడిగా కన్ఫర్మ్ చేసారు. ఈ చిత్రం షూటింగ్ లక్నోలో జరుగుతోంది. ఇప్పుడు, అనుపమ్ ఖేర్ ఈ చిత్ర తారాగణంలో చేరడం చిత్రంపై మరింత అంచనాలను పెంచింది.

‘ది వ్యాక్సిన్ వార్’ 15 ఆగస్ట్ 2023, స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల కానుంది మరియు హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, భోజ్‌పురి, పంజాబీ, గుజరాతీ, మరాఠీ మరియు బెంగాలీతో సహా 10 ప్లస్ భాషలలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని పల్లవి జోషి నిర్మించారు.

Exit mobile version