Filmmakers Registered For Operation Sindoor Title: ‘ఆపరేషన్ సిందూర్’.. ప్రస్తుతం భారతీయులంతా గర్విస్తున్న పేరు ఇది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతికార చర్యగా మన భారత రక్షణ దళాలు ఆపరేషన్ సిందూర్ పేరు పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడి చేసిన సంగి తెలిసిందే. క్షిపణులు, డ్రోన్లతో పాకిస్తాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ విరుచుకుపడింది. ఎంతో శక్తివంతమైన ఈ పేరును సొంతం చేసుకునేందుకు పలు నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి.
అప్పుడే ఈ టైటిల్ కోసం నిర్మాతలు దరఖస్తులు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15మందిపై బాలీవుడ్ నిర్మాతలు ఈ టైటిల్ కోసం అప్లై చేసినట్టు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (FWICE) అధ్యక్షుడు BN తివారి ఇండియా టుడేతో ధ్రువీకరించారు. టీ-సిరీస్, జీ స్టూడియో వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆ టైటిల్ కోసం అప్లై చేయడం గమనార్హం. ఈ టైటిల్ కోసం దరఖాస్తు చేసిన నిర్మాతల్లో ఒకరైన అకోశ్ పండిట్ మాట్లాడుతూ.. “దీనిపై సిఇనమా తెరకెక్కుతుందా? అనేది ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. అందరి దృష్టిని ఆకర్షించగలిగే పేర్లను తమ సినిమాలకు పెట్టుకునేందుకు ఏ దర్శక-నిర్మాతైన ఆసక్తి చూపిస్తారు.
ప్రస్తుతం అలాంటిదే ‘ఆపరేషన్ సిందూర్’. తాజా పరిణామాల నేపథ్యంలో చాలామంది నిర్మాతలు ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేసుకునేందుకు దరఖాస్తు చేస్తున్నారు. అయితే వారంత ఖచ్ఛితంగా దీనిపై సినిమా తీస్తారని లేదు. దేశం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటుందో నాకు తెలుసు. బాధితుడిగా 35 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా. పాకిస్తాన్ వల్ల ప్రత్యక్షంగా ఇబ్బంది పడిన నాకు ఈ టైటిల్ కీలకం అని భావిస్తున్నా” అని చెప్పుకొచ్చారు. అయితే ‘ఆపరేషన్ సిందూర్’ టైటిల్ కోసం దరఖాస్తు చేసిన మొదటి నిర్మాణ సంస్థగా ‘మహావీర్ జైన్ ఫిల్మ్స్’ ముందంజలో ఉంది. ఈ టైటిల్ కోసం ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ కూడా రిజిస్టర్ చేశారని సమాచారం.