Site icon Prime9

Bimbisara Collections: ’బింబిసార‘ వసూళ్లు.. మొదటిరోజే పెట్టుబడిలో సగం వచ్చేసింది

Bimbisara Ott date fix

Bimbisara Ott date fix

Bimbisara Collections: మంచి అంచనాలతో విడుదలైన నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా హైప్‌కు తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది. గత 2 నెలలలుగా కళ తప్పిన బాక్సాఫీసు వద్ద సందడి నెలకొంది. బింబిసార మొదటి రోజు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి 6.3 కోట్ల షేర్ వసూలు చేసింది.

నైజాం, సీడెడ్, వైజాగ్, నెల్లూరు ప్రాంతాలలో మొదటి రోజున ఈ చిత్రం తన పెట్టుబడిలో 50% తిరిగి పొందగలిగింది. ట్రెండ్ ప్రకారం చూస్తే, బింబిసార మొదటి వారాంతంలోనే తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. ప్రాంతాలవారీగా బింబిసార వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం 2.12 కోట్లు
సీడెడ 1.30 కోట్లు
వైజాగ్ 0.90 కోట్లు
తూర్పు 0.43 కోట్లు
వెస్ట్ 0.36 కోట్లు
కృష్ణ 0.34 కోట్లు
గుంటూరు 0.57 కోట్లు
నెల్లూరు 0.26 కోట్లు

మొత్తం డే1 షేర్ 6.27 కోట్లు. బింబిసార వసూళ్లు కళ్యాణ్ రామ్ కెరీర్లో అత్యధికం కావడం గమనార్హం. మరోవైపు నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార హిట్ అయినందుకు అభిమానులు, సినీ ప్రేక్షకులు, విమర్శకులు మరియు మీడియా అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Exit mobile version