Bigg Boss Shobha Shetty Taking Break from Social Media: బిగ్ బాస్ శోభాశెట్టి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆమెకు ఏమైందంటూ అభిమానులంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్తీక దీపం సీరియల్‌తో బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. మోనితాగా తెలుగులో ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. అదే క్రేజ్‌తో బిగ్‌బాస్ 7 సీజన్‌లో అడుగుపెట్టింది. హౌజ్‌లోని ప్రతి టాస్క్‌లో శివంగిలా రెచ్చిపోతూ ఆడేది.
ఈ క్రమంలో తనే గెలవాలన్న ఆశతో హౌజ్‌లో ప్రతిఒక్కరితో గొడవలు పడుతూ తీవ్ర నెగిటివిటీని మూటగట్టుకుంది. కార్తీక దీపం సీరియల్‌లో మోనిత వల్ల తనకు వచ్చిన నెగిటివిటీని పోగోట్టుకుని.. శోభాశెట్టిగా గుర్తింపు పొందాలనుకుంది. కానీ, బిగ్‌బాస్ అంతకు మంచి వ్యతిరేకత తెచ్చుకుంది. హౌజ్ నుంచి బయటకు రాగానే తన ప్రియుడు యశ్వంత్ రెడ్డిని నిశ్చితార్థం చేసుకుంది. అప్పటి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది.
తరచూ తన ఫోటోలు, తనకు హెల్త్, డైట్‌కి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట తెలగగ సందడి చేసింది. ఇక తెలుగు బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే.. కన్నడ బిగ్ బాస్‌లోనూ పాల్గొంది. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా మధ్యలోనే బయటకు వచ్చేసింది. అప్పటి నుంచి సైలెంట్‌గానే ఉన్న శోభశెట్టి.. తన ఫాలోవర్స్‌కి షాకిచ్చే న్యూస్ చెప్పింది. తాను కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నానని ప్రకటించింది.
ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేసింది. ఇది చూసి ఆమె ఫాలోవర్స్, ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. మోనితకు ఎమైందీ.. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమైన పర్సనల్ గొడవలా? తన ప్రియుడు, కాబోయే భర్త యశ్వంత్ రెడ్డి ఏమైనా విభేదాలు వచ్చాయా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి కారణం ఏంటో చెప్పలేదు.. కానీ, సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకోవడానికి అసలు కారణం ఏంటనేది మాత్రం చెప్పలేదు. ఈ సెడన్ నిర్ణయం వెనక కారణమేంటనేది మాత్రం మోనిత నుంచి క్లారిటీ కోసం అభిమానులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.