Site icon Prime9

Betting App Scandal: బెట్టింగ్‌ యాప్‌ వ్యవహరంలో విష్ణుప్రియ, టేస్టీ తేజలకు నోటీసులు

Vishnupriya and Tasty Teja Gets Police Notice: బెట్టింగ్‌ యాప్స్ ప్రమోట్‌ చేసిన యూట్యూబర్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్లు పోలీసులు షాకిచ్చారు. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేసిన టీవీ నటులు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు సహా 11 మందిపై తాజాగా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో బిగ్‌బాస్ విష్ణు ప్రియ, శ్యామల, టేస్టీ తేజ, నటి రితూ చౌదరి, సుప్రీతతో పాటు యూట్యూబర్లు వైవా హర్ష, సన్నీ యాదవ్‌, అజయ్‌, సుధీర్‌, అజయ్‌ వంటి తదితరులపై పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.

 

ఈ మేరకు విష్ణు ప్రియ, యూట్యూబర్‌, కమెడియన్‌ టేస్టీ తేజలకు తాజాగా పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. నేడు(మంగళవారం ) సాయంత్రం 4 గంటలకు పోలీసుల విచారణకు హాజరు కావాలని నోటీసులో ఆదేశించారు. ఇప్పటికే సేకరించిన యాప్స్‌ లింక్స్‌ ఆధారంగా పోలీసులకు ఒక్కొక్కరిగా నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. బెట్టింగ్‌ యాప్స్‌ నిర్మిలించేందుకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఉద్యమం ప్రారంభించారు. #Saynotobettingapps అంటూ యువతకు అవగాహన కల్పిస్తున్నారు.

 

ఇక ఈ బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేస్తున్న వారిపై ఆయన జులుం విధిలుస్తున్నారు. బెట్టింగ్‌ యాప్స్‌ని ప్రమోట్‌ చేస్తూ తమ ఫాలోవర్స్‌ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వారిని నమ్మి ఎంతో మంది ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లకి పాల్పడుతూ లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటూ అప్పుల పాలు అవుతున్నారు. అవి తీర్చలేక ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ సెలబ్రిటీలు ఇన్‌ఫ్లూయేన్సర్లు మాత్రం కోట్ల కోట్లలో డబ్బు సంపాదిస్తున్నారు. ఇక డబ్బు కోసం బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేస్తూ అమాకమైన ప్రజలు, యువత భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న యూట్యూబర్స్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై పోలీసులు చర్యలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే పలువురికి నోటీసులు ఇచ్చారు. ఇందులో బిగ్‌బాస్‌ 7 సీజన్ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ పేరు కూడా వినిపిస్తోంది.

Exit mobile version
Skip to toolbar