Vishnupriya Attends Panjagutta Police Station: బెట్టింగ్ యాప్ వ్యవహరంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన యూట్యూబర్స్, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్లపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దాదాపు 11 మందిపై పంజాగుట్ట పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఇందులో నటి, యాంకర్ విష్ణుప్రియ కూడా ఉంది. విచారణకు ఆదేశిస్తూ పోలీసులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. ఈ మేరకు విష్ణుప్రియ తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వచ్చింది.
గురువారం ఉదయం తన అడ్వకేట్‌తో కలిసి ఆమె విచారణకు హాజరైంది. అడ్వకేట్ సమక్షంలో పంజాగుట్ట పోలీసులు ఆమెను విచారించనున్నారు. ఈ సందర్భంగా ఏమే అంశాలపై ఆమెను విచారించనున్నారనేది ఆసక్తిగా మారింది. కాగా ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని విచారించారు పోలీసులు. త్వరలోనే మిగతా వారిని కూడా విచారించనున్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ నిర్మూలనకు నడుం బిగించారు. ఇందులో భాగంగా ఈ యాప్స్ వ్యతిరేకంగా ఆయన ఉద్యమం చేపట్టారు.
#saynotobettingapp పేరుతో యువతలో అవగామన కల్పిస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతోమంది సామాన్య ప్రజలు, యూత్ అప్పుల్లో కూరుకుపోతుందని, వాటిని తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారు కోట్లు సంపాదిస్తున్నారు. వారిని నమ్మి బెట్టింగ్‌కి పాల్పడుతున్న ప్రజలు, యూత్ మాత్రం అప్పుల బాధలతో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ బెట్టింగ్ యాప్స్‌కి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.