Kota Srinivasa Rao Latest Health Condition: సీనియర్ నటులు కోట శ్రీనివాస రావు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వెండితెరపై ఎన్నో విభిన్న పాత్రలతో అలరించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. విలన్, తండ్రిగా, కమెడియన్, ఇలా ఎన్నో సహాయకపాత్రలు చేశారు. ఒక్క తెలుగులోనే కాదు.. తమిళ్, కన్నడ, మలయాళీ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు. ఆహా నా పెళ్లంటలో ఆయన నటించిన పిసినారి పాత్ర.. ఇప్పటికీ ఇండస్ట్రీలో చెరగని ముద్రగా ఉంది.
ఏ మీమ్‌లో చూసిన, సరదాగా మాట్లాడుకున్నా.. ఈ సినిమాలో కోట డైలాగ్స్ గుర్తు చేసుకోవాల్సిందే. అంతగా ఈ పాత్రలో ఆకట్టుకున్నారాయన. కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. వయసు రిత్యా ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయినప్పటి అప్పుడప్పుడ పలు ఇంటర్య్వూలో మెరిసే ఆయన ఈ మధ్య అసలు కనిపించడం లేదు. లాంగ్ గ్యాప్ తర్వాత కోట శ్రీనివాసరావుకి లేటెస్ట్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది.
నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ తాజాగా ఆయనను కలిశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోను తన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. “కోట శ్రీనివాసరావు గారితో ఈరోజు. కోటా బాబాయ్‌ని కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇందులో కోట శ్రీనివాస్ షాకింగ్ లుక్‌లో కనిపించలేదు. గుర్తుపట్టలేనంతగా వృధ్యాప్యంలో ఉన్నారాయన. ప్రస్తుతం పలు వృధ్యాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. కాళ్ల వాపు, ఒక కాలికి పట్టితో బక్కచిక్కి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు.
ఆయనను చూసి అంత షాక్ అవుతున్నారు. ఏంటీ ఆయన ఇంత మారిపోయారంటూ అవాక్క్ అవుతున్నారు. ఏదేమైన చాలా కాలం తర్వాత కోట శ్రీనివాస్‌ను చూడటం తమకు ఆనందాన్ని ఇచ్చిందని, ఆయనకు దేవుడ మంచి ఆరోగ్యం ఇవ్వాలని నెటిజన్స్, ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు. 1978లో చిరంజీవి ప్రాణం ఖరీదు సినిమాలో కోట శ్రీనివాసరావు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. నటుడిగా ఆయనను పరిచయమైన తొలి చిత్రమిదే కావడం విశేషం. అలాగే చిరంజీవికి హీరోగా తొలి చిత్రం కూడా ఇదే. ప్రస్తుతం అనారోగ్యం సమ్యల కారణంగా ఆయన నటనకు దూరం అవ్వడం అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది.