Ashish Vidyarthi: ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్థి అస్సాంకు చెందిన రూపాలీ బారువాను గురువారం వివాహం చేసుకున్నారు. పలు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు మరిన్ని ప్రాంతీయ చిత్రాలలో నటించిన ఆశిష్ కు ఇది రెండవ వివాహం. అతను గతంలో నటి శకుంతల బారువా కుమార్తె రాజోషి బారువాను పెళ్లి చేసుకున్నారు. అయితే విబేధాల కారణంగా వారిద్దరు విడిపోయారు.
అసాధారణ అనుభూతి..(Ashish Vidyarthi)
ఆశిష్ మరియు రూపాలి కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలో రిజిస్ట్రీ వివాహం చేసుకున్నారు.60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడం గురించి తన భావాలను ఆయన పంచుకున్నారు. నా జీవితంలో ఈ దశలో, రూపాలిని పెళ్లి చేసుకోవడం ఒక అసాధారణ అనుభూతి. మేము ఉదయం వివాహం, సాయంత్రం గెట్ టుగెదర్ అని అన్నారు. గౌహతికి చెందిన రూపాలి కోల్‌కతాలోని ఒక ఉన్నతస్థాయి ఫ్యాషన్ స్టోర్ ను నిర్వహిస్తున్నారు.
బాలీవుడ్‌లో విలన్ పాత్రలకు ప్రసిద్ది చెందిన ఆశిష్ విద్యార్థి జూన్ 19, 1962న ఢిల్లీలో జన్మించారు. 1986లో కెరీర్ ప్రారంభించి పలు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, ఒడియా, మరాఠీ మరియు బెంగాలీ చిత్రాలలో కనిపించారు. అతను ఇప్పటివరకు 11 విభిన్న భాషలలో దాదాపు 300 చిత్రాల్లో నటించారు.