Site icon Prime9

Saira Banu: ఆస్పత్రిలో చేరిన రెహమాన్‌ మాజీ భార్య సైరా భాను

AR Rahman Ex Wife Saira Banu Hospitalised: ఆస్కార్‌ అవార్డు గ్రహిత, స్టార్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌ మాజీ భార్య సైరా బాను ఆస్పత్రిలో చేరారు. మెడికల్‌ ఎమర్జేన్సీ కారణంగా సైరా భాను ఆస్పత్రిలో చేరినట్టు ఆమె తరపు ప్రతినిథి ఒక ప్రకటన విడుదల చేశారు. ఆమెకు శస్త్ర చికిత్స అవసరం ఉందని ప్రకటనలో పేర్కొన్నారు. “కొన్ని రోజుల క్రితం సైరా భాను మెడికల్‌ ఎమర్జెన్సీ కారణంగా ఆస్పత్రిలో చేరారు.

ఆమె శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు. ఈ కఠిమైన సమయంలో సైరా త్వరగా కోలుకోవడంపై తన దృష్టి పెట్టారు. ఎవరూ కూడా ఆందోళన చెందవద్దు. మీ అందరి మద్దతు, ప్రేమతో క్షేమంగా తిరిగి వస్తారు” అని ప్రకటలో వెల్లడించారు. అయితే సర్జరీ కోసం ఆమె లాస్‌ ఎంజిల్స్‌ వెళ్లినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఈ కష్ట సమయాల్లో తనకు మద్దతు ఇచ్చిన లాస్‌ ఎంజిల్స్‌ స్నేహితులు రసూల్‌ పూకుట్టి, అతని భార్య షాదియా, వందనా షా, మిస్టర్‌ రెహమాన్‌లకు హృదయపూర్వక క్రతజ్ఞతలు తెలిపారు.

కాగా గతేడాది ఏఆర్‌ రెహమాన్‌, సైరా బానులు విడాకుల ప్రకటన ఇచ్చి ప్రతి ఒక్కరికి షాకిచ్చారు. 2024 నవంబర్‌లో తమ 29 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నామంటూ ఇద్దరు విడాకులు ప్రకటన చేశారు. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. దాదాపు ముప్పై ఏళ్లు కలిసి ఉన్న వీరు విడాకులు తీసుకోవడంతో అభిమానులు, సన్నిహితులు ఆశ్చర్యానికి గురయ్యారు.

Exit mobile version
Skip to toolbar