AR Rahman Discharge From Hospital: స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు స్పందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందని, కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కూడా అయినట్టు చెప్పారు. ఆదివారం ఉదయం ఆయన ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఆరోగ్యంపై ఆస్పత్రి యాజమాన్యం కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంతక ఆయన ఆరోగ్యంపై వారు ఏం చెప్పారంటే..
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహిత ఏఆర్ రెహమాన్ ఆదివారం(మార్చి 16) అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం ఆయనకు ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించినట్టు కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే కాసేపటి క్రితం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులు ఆయన హెల్త్ అప్‌డేట్ ఇచ్చారు. డీహైడ్రేషన్, గ్యాస్ట్రిక్ కారణంగా ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, ఈ మేరకు ఆయనకు చికిత్స అందించామన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుందన్నారు.
ఇక ఆయన సోదరి రిహానా కూడా తన ఆయన ఆరోగ్యంపై స్పందించారు. ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరారంటూ వస్తున్న వార్తలు నిజం కాదని, స్వల్ప అస్వస్థతతోనే ఆయన హాస్పిటల్‌కి వచ్చినట్టు చెప్పారు. డిహైడ్రేషనర్, గ్యాస్ట్రిక్ వల్ల కాస్తా ఇబ్బంది పడ్డారని, దానికి చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయినట్టు వెల్లడించారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే ఛాతి నొప్పితో ఆయన ఆస్పత్రిలో చేరారంటూ తప్పుడు ప్రచార చేస్తున్నారని, అందులో నిజం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు ఆయన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చెయొద్దని రెహహాన్ సోదరి మీడియాను కోరారు.