AR Rahman Joins in Hospital: ఆస్కార్ ఆవార్డు గ్రహిత, స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ ఆస్వస్థతకు గురైనట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం ఉదయం ఆయన ఛాతిలో నొప్పితో ఇబ్బంది పడ్డారట. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సమాచారం. కోలివుడ్ మీడియా కథనాల ప్రకారం ఇవాళ (మార్చి 16) ఉదయం చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో చేర్చినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై కుటుంబ సభ్యుల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ వార్త తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆ
లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో సినిమా
యన త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యం తిరిగి రావాలని ప్రార్థిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్స్ పెడున్నారు. ప్రస్తుతం ఆయన వర్క్ విషయానికి వస్తే.. ఏఆర్ రెహమాన్ రీసెంట్ హిందీ బ్లాక్‌బస్టర్ ఛావా మూవీకి సంగీతం అందించారు. ప్రస్తుతం తెలుగులో ఆయన ఓ సినిమాకు వర్క్ చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న RC16కి ఆయనే సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత ఏఆర్ రెహమాన్ వర్క్ చేస్తున్న తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. పూజా కార్యక్రమానికి ముందే ఈ సినిమా కోసం ఆయన మూడు పాటలు కంపోజ్ చేసినట్టు ఇటీవల మూవీ టీం తెలిపింది.
గతేడాది విడాకులు
మరోవైపు ఆయన తన వ్యక్తిగత విషయాలతో ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఆయన తన భార్య సైరా భానుకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తమ 29 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ పరస్పర అంగీకారంతో ఇద్దరు విడాకులకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వేదికగా ప్రకటించారు. మరికొన్ని రోజుల్లో 30 ఏళ్ల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నామని ఆనందించాం. కానీ అనుకోకుండా మా వివాహ బంధానికి ముగింపు పలకాల్సి వస్తుందని అనుకోలేదంటూ ఎఆర్ రెహమాన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఇక ఆయన మాజీ భార్య సైరా భాను ఇటీవల సర్జరీ కోసం విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఏఆర్ రెహమాన్ అస్వస్థకు గురికావడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.