Site icon Prime9

Adivi Sesh: అడివి శేష్‌ ‘డెకాయిట్‌’లో బాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌ – పోస్టర్ రిలీజ్!

Anurag Kashyap Makes His Tollywood Debut: యంగ్‌ హీరో అడివి శేష్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘డెకాయిట్‌’. యాక్షన్‌ డ్రామా, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం తెరకెక్కుతోంది. షనీల్‌ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్‌ నటి వామిక గబ్బి ముఖ్య పాత్రలో కనిపించింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది.

ఇప్పటికే ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం మూవీపై ఆసక్తిని పెంచుతోంది. ఈ క్రమంలో మరో స్టార్‌ దర్శకుడు డెకాయిడ్‌లో భాగం కాబోతున్నారు. తాజాగా ఆయన లుక్‌ని రిలీజ్‌ చేస్తూ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది మూవీ టీం. ఆయన మరెవరో కాదు బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌, యాక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌. ఇందులో ఆయన పోలీసు ఆఫీసర్‌గా నెగిటివ్‌ షేడ్‌ పాత్ర పోషిస్తున్నట్టు మూవీ టీం పేర్కొంది. ఈ చిత్రంలో నటిస్తుండటం తనకు చాలా సంతోషంగా ఉందంటూ స్వయంగా ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు తన లుక్‌ పోస్టర్‌ని అభిమానులతో పంచుకుంటూ “అడవి శేష్‌ డికాయిట్‌లో ఇన్‌స్పెక్టర్‌ స్వామి పాత్ర పోషిస్తున్నాను. ఇది నా మొదటి తెలుగు, హిందీ బైలింగువల్‌ ప్రాజెక్ట్‌గా వస్తోంది. ఈ సినిమాలో భాగం కావడం నాకు చాలా సంతోషం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది” అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ సినిమాకు అడివి శేష్‌ కథ, స్క్రిన్‌ప్లే అందించడం విశేషం. షనీల్‌ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తుండగా టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత సునీల్‌ నారంగ్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. నెక్ట్స్‌ షెడ్యూల్‌ మహారాష్ట్రలో జరగనుందని సమాచారం.

Exit mobile version
Skip to toolbar