Tamannaah Bhatia and Vijay Varma attend Holi Event: మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మ బ్రేకప్ చెప్పుకున్నారంటూ కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఇంతవరకు తమన్నా, విజయ్‌లు స్పందించలేదు. కానీ, ఇదే నిజమే అన్నట్టుగా బి-టౌన్‌లో గట్టి ప్రచారం జరుగుతుంది. వారి బ్రేకప్ రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వేళ తమన్నా, విజయ్ వర్మలు హోలీ వేడుకల పాల్గొని సందడి చేశారు. నటి రవీనా టాండన్ ఏర్పాటు చేసిన ఈ హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మలు కూడా పాల్గొన్నారు.
అయితే వీరద్దరు వేరు వేరుగా ఈ వేడుకకు హాజరయ్యారు. సెలబ్రేషన్స్ అనంతరం కూడా ఇద్దరు వేరు వేరుగానే ఇళ్లకు తిరిగి వెళ్లిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్రేకప్ రూమర్స్ వైరల్ అవుతున్న వేళ్ల వీరు ఒకే పార్టీలో పాల్గొనడంతో మరోసారి ఈ జంట వార్తల్లో నిలిచింది. ఏ ఈవెంట్‌కి అయినా జంటగా వచ్చే వీరిద్దరు ఇప్పుడు వేరు వేరు రావడంతో వారి బ్రేకప్ రూమర్స్‌కి మరింత ఆజ్యం పోసినట్టు అయ్యింది. కాగా తమన్నా, విజయ్‌లు జంటగా ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్‌లో తొలిసారి జంటగా నటించారు. ఈ సిరీస్ షూటింగ్ టైంలోనే వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది.
కొంతకాలం సీక్రెట్ డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు 2023లో వారి ప్రేమను కన్‌ఫాం చేశారు. గోవాలో జరిగిన న్యూ ఇయర్ ఈవెంట్‌లో పాల్గొన్న వీరు ముద్దు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పుడే వీరి ప్రేమ వ్యవహరం బయటపడింది. ఆ తర్వాత వారి రిలేషన్ ఆఫీషియల్ చేశారు. అయితే పెళ్లి, కెరీర్ విషయంలోనే వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్టు తెలుస్తోంది. పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలైపోవాలని తమన్నా నిర్ణయించుకుని దాన్ని విజయ్‌కి చెప్పగా.. అతడు దానికి సముఖత చూపించలేదట. తన కెరీర్ ఇప్పుడిప్పుడే మొదలైందని, తాను అప్పుడే పెళ్లికి సిద్ధంగా లేనని చెప్పాడట. ఇంకా తనకి టైం కావాలని అడిగాడట. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, విజయ్ సమాధానం నచ్చని తమన్నా అతడికి దూరంగా ఉంటుందని టాక్. మరి ఈ వార్తల్లో నిజమెంతనేది తెలియదు. మరి ఈ బ్రేకప్ రూమర్స్ తమన్నా, విజయ్‌లు ఎప్పుడు నోరు విప్పుతారో చూడాలి.