Site icon Prime9

Amala Paul: బోల్డ్ బ్యూటీకి లగ్జరీ కారు గిఫ్ట్.. ధర తెలిస్తే దిమ్మతిరగడమే

Amala Paul: అందాల భామ  అమలా పాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైనా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమలా పాల్.. ఆ తరువాత తెలుగు, తమిళ్ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ తో నటించి మెప్పించింది. ఇక తెలుగులోనే కాకుండా తమిళ్ లో ఉన్న కుర్ర హీరోలందరితో ఆమె రొమాన్స్ చేసింది.

 

అమలా పాల్ సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే ఫేమస్ అయ్యింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే కోలీవుడ్ డైరెక్టర్ KL విజయ్ ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. రెండేళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఆ తరువాత విభేదాలతో విడిపోయారు. అమలా పాల్ ప్రవర్తన వలనే తాము విడాకులు తీసుకున్నట్లు విజయ్ చెప్పుకొచ్చాడు. ఇక విడాకుల అనంతరం విజయ్ రెండో వివాహం చేసుకున్నాడు.

 

విజయ్ తో విడిపోయాకా అమలా నిర్మాతగా మారింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ విజయాలను అందుకుంది. ఆ సమయంలోనే భవనీందర్ సింగ్‌తో ఆమె చేసిన ఒక సాంగ్ సెన్సేషనల్ సృష్టించింది.  అందులో వారు పెళ్లి చేసుకొని, ముద్దులు కూడా పెట్టుకొని కనిపించారు. దీంతో వీరిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకున్నారు అనుకున్నారు. కానీ, భవనీందర్ సింగ్‌ తనను డబ్బుల విషయంలో మోసం చేశాడని, అతను తనను పెళ్లి చేసుకోలేదని ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. 

 

ఇక ఈ వివాదాల నడుమ అమలా పాల్.. జగత్ దేశాయ్ తో తన పెళ్లి జరగనున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది.  వెంటనే వారి వివాహాం ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఇతనే నా జీవితం అని అమలా చెప్పుకొచ్చింది. ఇక పెళ్ళైన ఏడాదికే అమలా ప్రెగ్నెంట్ అయ్యింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ప్రస్తుతం హ్యాపీ ఫ్యామిలీని అమలా లీడ్ చేస్తుంది.

 

తాజాగా జగత్ దేశాయ్.. అమలా పాల్ కు  లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చాడు. అత్యంత ఖరీదైన BMW 7 సిరీస్ ను భార్యకు గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారు విలువ  అక్షరాలా రూ. 2 కోట్లు.  కారు చూడగానే అమలా.. భర్తను గట్టిగా హత్తుకొని ముద్దుపెడుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ప్రస్తుతం అమలా కొడుకుతో బిజీగా ఉంది. త్వరలో తెలుగులో రీఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

Exit mobile version
Skip to toolbar