Prime9

Allu Arjun: ఆర్సీబీ గెలుపుపై అల్లు అర్జున్‌ రియాక్షన్‌ – అయాన్‌ వీడియో షేర్‌ చేసి మురిపోతున్న బన్నీ

Allu Arjun Son Ayaan Got Fully Emotional After RCB Won: ‘ఈ సాలా కప్‌ నమ్‌దే’ ఈ మాట ఎంతోకాలంగా వింటూనే ఉన్నాం. ఐపీఎల్‌లో ఆర్సీబీని ఛాంపీయన్‌గా చూడాలని ఫ్యాన్స్‌ అంతా 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా ఆర్సీబీ కప్‌ గెలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో పంజాబ్‌తో పోరులో ఆర్సీబీ గెలిచి ఐపీఎల్‌ 2025 ఛాంపియన్‌గా నిలిచింది. మ్యాచ్‌ గెలిచిన అనంతరం కింగ్‌ కోహ్లీ ఒక్కసారిగా ఎమోషనల్‌ అయ్యాడు.

 

ఆ క్షణం అభిమానులందరిని బాగా హత్తుకుంది. 18 ఏళ్లకు ఆర్సీబీ ఐపీఎల్‌ ట్రోఫీని గెలవడంతో అభిమానులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. సోషల్‌ మీడియా వేదిక ఆర్సీబీ గెలుపుని వేడుకగా చేసుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం స్పందిస్తూ.. ఎన్నో ఏళ్ల కల నెరవేరిందంటూ.. ఆర్సీబీకి అభినందలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సైతం ఆర్సీబీ విక్టరీపై హర్షం వ్యక్తం చేశారు. సదరు టీం అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశాడు.  “వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. ఈ సాలా కప్‌ నమ్‌దే. ఎట్టకేలకు 18 ఏళ్ల కల నిజమైంది. బిగ్‌ బిగ్‌ కంగ్రాట్చ్యులేషన్‌ టూ ఆర్సీబీ”అంటూ ఆనందం వ్యక్తం చేశాడు.

 

అలాగే మరో ఆసక్తికర వీడియోని కూడా షేర్‌ చేశాడు. ఆర్సీబీ గెలడవతో బన్నీ కొడుకు అయాన్‌ ఎమోషనలైన వీడియోని షేర్‌ చేశాడు. ఐ లవ్‌ కోహ్లి అంటూ ఆర్సీబీ ఘనవిజయం సాధించడంతో ఎమోషనల్‌ అయ్యాడు. ముఖ్యంగా కోహ్లీ ఎమోషనల్‌ మూమెంట్‌ చూసి అయాన్‌ సైతం భావోద్వేగానికి లోనయ్యాడు. 18 ఏళ్లకు అబ్బా.. ఆర్సీబీ గెలిచింది. అంటూ అరుస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. అయాన్‌ ఏమైందీ.. ఆనందంతో ఆయాన్‌ తలపై నీళ్లు పోసుకున్నాడు. బన్నీ కొడుకుని తీరు చూసి మురిసిపోతూ ఏమైందీ అయాన్‌ అంటూ చిరు నవ్వులు చిందిస్తున్నాడు. ఈ వీడియో ‘ఫుల్లీ ఎమోషనల్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం అయాన్‌ వీడియో సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతుంది.

Exit mobile version
Skip to toolbar