Allu Arjun on The Hollywood Reporter India: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప ఎంతంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రిలీజైనప్పటి నుంచి రికార్డ్స్ బ్రేక్ చేస్తూ కొత్త రికార్డును క్రియేట్ చేస్తూ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. మొత్తం రూ. 1871 కోట్ల గ్రాస్‌తో ఇండియన్ సినిమాల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ‘పుష్ప 2’ నిలిచింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లింది.
హాలీవుడ్ మొత్తం పుష్ప 2 చిత్రంపై ప్రశంసలు కురిపించింది. ఇప్పటికే పుష్ప 1 సినిమాకు గానూ నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించాడు. ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా వార్తల మ్యాగజైన్ ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’ (The Hollywood Reporter India) ఇప్పుడు భారత్‌లోనూ ప్రచురితం కాబోతోంది. ఈ మ్యాగజైన్ తొలి సంచిక అల్లు అర్జున్ ఫోటోదె ప్రచురితం చేయబోతోంది. ఇందు కోసం అల్లు అర్జున్‌తో ఫోటోషూట్ నిర్వహించారు. దీనికి సంబంధించి బీటీఎస్ ప్రోమోను తాజాగా షేర్ చేశారు. ఇందులో అల్లు అర్జున్ తన గురించి పంచుకున్న విశేషాలను షేర్ చేశారు.
“ఇండియన్ బాక్సాఫీసు వద్ద నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాను. నా జీవితంలో లభించిన అతిపెద్ద అవకాశంగా భావిస్తున్నాను. బలం, ఆత్మవిశ్వాసం అనేవి మనసులో ఉంటాయి. వాటిని ఎవరూ తీసేయలేరు. కొన్ని లక్షణాలు పుట్టుకతో వస్తాయి. ఇది అలాంటిదే. విజయం తర్వాత కూడా వినయంగా ఉండటం చాలా ముఖ్యం”
“జీవితంలో సక్సెస్ అయిన తర్వాత కూడా ఎలాంటి గర్వాం లేని చాలా మందిని నేను చూశాను. అది వారి వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఇకపోతే నేను వందశాతం సామాన్యుడినే. సినిమా చూస్తున్నప్పుడు కూడా ఇదే భావనతో ఉంటాను. అలాగే విరామ సమయంలో కేవలం విశ్రాంతి మాత్రమే తీసుకుంటాను. ఏమీ చేయకుండా ఉండటమే నాకిష్టం. కనీసం పుస్తకం కడా చదవను” అంటూ బన్నీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.