Site icon Prime9

Who is Sai Abhyankkar: సాయి అభ్యంకర్.. బాగా వినిపిచ్చే పేరు అవుతుంది!

Allu Arjun – Atlee film, Sai Abhyankar to compose music for the biggie

Allu Arjun – Atlee film, Sai Abhyankar to compose music for the biggie

Who is Sai Abhyankkar: సాయి అభ్యంకర్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు. అసలు ఎవరితను.. ? ఎందుకు ట్రెండ్ అవుతున్నాడు.. ? ఇతనికి.. AA22 కి సంబంధం ఏంటి.. ? అనేది తెలుసుకుందాం.  తెలుగులో అద్భుతమైన సాంగ్స్ పాడి అలరించిన గాయకుడు టిప్పు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అతని వారసుడే సాయి అభ్యంకర్.

 

సింగర్ టిప్పు, సింగర్ హరిణిల పెద్ద కుమారుడు. కేవలం 21 ఏళ్ల ఈ కుర్రాడు.. చిన్నతనం నుంచే స్వరాలతోనే ఆడుకొని పెరిగాడు. థింక్ ఇండీ కోసం అభ్యాంకర్ స్వరపరిచిన తొలి స్వతంత్ర సింగిల్ కచ్చి సెర ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. 2024 లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సెర్చ్ చేసిన సాంగ్స్ లో ఇది ఒకటి. దీని తరువాత హీరోయిన్ ప్రీతీ ముకుందన్ నటించిన ఆశా కూడా సాంగ్ ను ఎవరు మర్చిపోగలరు.

 

సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేసిన ఈ సాంగ్ కు కూడా సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించిందే. అలా 21 ఏళ్లకే స్టార్ మ్యూజిక్ కంపోజర్ గా పేరు తెచ్చుకున్న ఈ కుర్రాడికి తమిళ్ లో వరుస అవకాశాలు తలుపుతట్టాయి. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బెంజ్ అనే సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా సాయి అభ్యంకర్ సెలెక్ట్ చేశారు.

 

ఇదొక్కటే కాదు. సూర్య 45, ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమాకు ఇతనే మ్యూజిక్ ను అందిస్తున్నాడు. అనిరుధ్ తరువాత అంతటి  పేరు తెచ్చుకున్న కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ అంటే సాయి అభ్యాంకర్ అనే చెప్పాలి. ప్రస్తుతం అతని డిమాండ్ మాములుగా లేదు. ఇక ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్ – అట్లీ కాంబోలో వస్తున్న సినిమాకు కూడా సాయి అభ్యంకర్ నే మ్యూజిక్ అందిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

 

ఇంత పెద్ద ప్రాజెక్ట్ కు ఒక కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ ఏంటి అనే అనుమానాలు  రావోచ్చు. కానీ,  అతని వర్క్ ఎలా ఉంటుందో తెలిసాక.. కచ్చితంగా ఈ సినిమా కూడా మ్యూజిక్ లో రికార్డ్ సృష్టిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరి ఈ ప్రాజెక్ట్స్ మధ్యలో సాయి అభ్యాంకర్.. AA22 పై ఎక్కువ శ్రద్ద పెట్టగలడా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా తరువాత ఈ కుర్రాడి పేరు మారుమ్రోగుతుందని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

 

 

Exit mobile version
Skip to toolbar