Site icon Prime9

Mahakali: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోకి బాలీవుడ్ సీనియర్ హీరో..

Prashanth Varma Ropes in Akshaye Khanna for Mahakali

Prashanth Varma Ropes in Akshaye Khanna for Mahakali

Mahakali: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అ! సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు.  ఇప్పటివరకు ఒక్క ప్లాప్ కూడా అందుకొని డైరెక్టర్స్ లిస్ట్ లో ఈ కుర్ర డైరెక్టర్ కూడా చేరిపోయాడు. ఇక హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.  హనుమాన్ తరువాత PVCU ప్రారంభించాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్. ఇందులో కేవలం సూపర్ హీరోస్ సినిమాలనే తెరకెక్కిస్తున్నట్లు తెలిపాడు. ఇప్పటికే హనుమాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ ను తెరకెక్కిస్తున్న ప్రశాంత్ వర్మ.. ఇది కాకుండా మరో సూపర్ హీరో సినిమాను పట్టాలెక్కించాడు. అదే మహాకాళీ.

 

గత ఏడాదిలోనే మహాకాళీ సినిమాను ప్రకటించాడు. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఒక స్టార్ హీరోయిన్ నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే మహాకాళీలో ఒక బాలీవుడ్ సీనియర్ హీరో నటిస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.  ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్.. మహాకాళీ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా నటిస్తున్నాడని పోస్ట్ చేయడం వైరల్ గా మారింది.

 

అక్షయ్ ఖన్నా ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు కీలక పాత్రలు పోషిస్తూ కూడా బిజీగా మారాడు. ఈ ఏడాది రిలీజైన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఛావా సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. శంభాజీ మహారాజ్ ను చిత్రహింసలు పెట్టి.. మరాఠీ సామ్రాజ్యాన్ని కైవసం చేసుకోనే ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.

 

ఛావా సినిమా విక్కీ కౌశల్ కు ఎంత పేరును అయితే తెచ్చిందో అక్షయ్ ఖన్నాకు కూడా అంతే గుర్తింపును అందించింది. ఇక ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందిపుచ్చుకున్న అక్షయ్ ఖన్నా.. టాలీవుడ్ ఎంట్రీనే  ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఇస్తున్నాడు.  ఈ ఛాన్స్ నిజంగా ఆయనకు లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. త్వరలోనే మహాకాళీ టీమ్ అక్షయ్ ఖన్నాను అధికారికంగా PVCU లోకి ఆహ్వానించనుంది. మరి ఈ సినిమాతో తెలుగులో కూడా అక్షయ్ ఖన్నా విజయాన్ని  అందుకుంటాడో లేదో చూడాలి.

Exit mobile version
Skip to toolbar