Site icon Prime9

Good Bad Ugly Teaser: ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ టీజర్‌ వచ్చేసింది – మాస్‌ అవతార్‌లో అదరగొట్టిన అజిత్‌

Good Bad Ugly Tamil Teaser: కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘గుడ్ బ్యాడ్‌ అగ్లీ’. మార్క్‌ ఆంటోని ఫేం అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో త్రిష హీరోయిన్‌. ముందు నుంచి ఈ చిత్రంపై ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అజిత్‌ లుక్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఏప్రిల్‌ 10న వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేసింది.

ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ టీజర్‌ రిలీజ్‌ చేసి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేసింది. తమిళంలో రిలీజైన ఈ టీజర్‌ ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా అజిత్‌ లుక్‌, షేడ్స్‌ మూవీపై మరింత హైప్‌ పెంచుతున్నారు. 1:29 నిమిషాల నిడివితో ఉన్న ఈ టీజర్‌ మొత్తం అజిత్‌ క్యారెక్టర్స్‌ చూట్టు తిరిగింది. ఇందులో ఆయన విభిన్న షేడ్స్‌లో కనిపించనున్నాడని టీజర్‌ చూస్తుంటే తెలుస్తోంది. మాస్‌ అవతార్‌ ఫ్యాన్స్‌ చేత ఈళలు వెయించాల ఉంది.

Good Bad Ugly Tamil Teaser | Ajith Kumar | Trisha | Adhik Ravichandran | Mythri Movie Makers

కొన్నిసీన్స్‌లో క్లాస్‌గా, మరికొన్ని సీన్స్‌ మాస్‌గా విభిన్న లుక్స్‌ మూవీపై బజ్‌ క్రియేట్‌ చేస్తుంది. చూస్తుంటే ఇదోక గ్యాంగ్‌స్టర్‌ డ్రామా అనే అర్థమవుతోంది. బ్యాగ్రౌండ్‌ స్కోర్ అజిత్‌ లుక్, పాత్రలను మరింత ఎలివేట్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ టీజర్‌ మూవీపై అంచనాలను మరింత రెట్టింపు చేస్తుంది. టాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో నవీన్‌ యర్నేని, రవి శంకర్‌ యలమంచిలీలు నిర్మిస్తున్న ఈ సినిమా జీవీ ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar