Prime9

Fawad Khan-Mahira Khan: ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై కామెంట్స్‌ – పాకిస్తానీ ఆర్టిస్ట్స్‌ ఫవాద్‌ ఖాన్‌, మహిరా ఖాన్‌పై బ్యాన్‌

Cine Association Seeks Ban on Pakistani Artists: ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై పాకిస్తాన్‌ నటీనటులు ఫవాద్‌ ఖాన్‌, మహిరా ఖాన్‌లు చేసిన కామెంట్స్‌ని ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ (AICWA) తీవ్రంగా ఖండించింది. భారతదేశ సైనిక ప్రతిస్పందనపై అనుచిత వ్యాఖ్యలు మన దేశాన్ని అగౌరవ పరిచేలా ఉన్నాయని. వారిని తక్షణమే చిత్ర పరిశ్రమ నుంచి బహిష్కరించాలని ఏఐసీడబ్ల్యూఏ పిలుపునిచ్చింది. కళల పేరుతో ఇలాంటి వారికి గుడ్డిగా మద్దతు ఇవ్వోద్దని పేర్కొంది. ఈ మేరకు ఎక్స్‌లో పత్రిక ప్రకటన ఇచ్చింది.

 

భారత దేశాన్ని బహిరంగంగా విమర్శిస్తూ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి దేశం తీసుకుంటున్న చర్యలను ప్రశ్నించిన పాకిస్తాన్‌ నటి మహిరా ఖాన్‌ ఆపరేషన్‌ సిందూర్‌ విమర్శిస్తూ నటుడు ఫవాద్‌ ఖాన్‌ దేశానికి వ్యతిరేకంగా చేసిన ప్రకటనలను ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ తీవ్రంగా ఖండిస్తోంది. “ఫవాద్‌ ఖాన్‌, మహిరా ఖాన్‌ల కామెంట్స్‌ మన దేశాన్ని అగౌరవపరిచేలా ఉండడం మాత్రమే కాదు.. ఉగ్రవాదం కారణంగా ప్రాణాలు కొల్పోయిన అమాయకులను, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికలును కూడా అవమానించేలా ఉన్నాయి. ఉగ్రవాద చర్యను ఖండించాల్సింది బదులుగా మన దేశ వైఖరిని ప్రశ్నించేలా ఫవాద్‌ ఖాన్‌ ప్రకటన ఉంది.

 

ఇది అసలు సహించారాని చర్య. కాబట్టి మన చిత్ర పరిశ్రమలో పనిచేస పాకిస్తానీ కళాకారులను, చిత్రనిర్మాతలు, ఫైనాన్షియర్లపై బ్యాన్‌ విధించాలి. భారతీయులెవరూ వీరిని అభిమానించొద్దు. కళ పేరుతో ఇలాంటి కళాకారులకు గుడ్డి మద్దతు ఇవ్వడం జాతీయ గౌరవాన్ని అగౌరవపరచడమే అవుతుందని చిత్ర పరిశ్రమ అర్థం చేసుకోవాల్సిన సమయంలో ఆసన్నమైంది. మన పరిశ్రమలోని కొంతమంది వ్యక్తులు మన దేశ భావాలను విస్మరిస్తూ, పాకిస్తానీ కళాకారుల పట్ల సానుభూతి, మద్దతును ప్రదర్శిస్తూనే ఉన్నారు. భారతదేశాన్ని బహిరంగంగా అగౌరవపరిచే వారికి మద్దతు ఇవ్వడం మానేయాలని AICWA సినీరంగాన్ని కోరుతోంది.

 

సంగీత కంపెనీలు, కళాకారులు బాధ్యత తీసుకోవాలి

ఇది కేవలం కళ గురించి మాత్రమే కాదు – ఇది క్లిష్టమైన సమయాల్లో మీ దేశంతో నిలబడటం కూడా. మన దేశం ముందుండాలి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశం కోసం ఐక్యంగా నిలబడదాం” అని పిలుపునిచ్చింది. అనేక భారతీయ సంగీత సంస్థలు పాకిస్తానీ కళాకారులను ప్రోత్సహిస్తూ, వారికి తరచు మ్యూజిక్‌ కన్సర్ట్స్‌ ఇవ్వడం దురదృష్టకరం. చాలా మంది భారతీయ గాయకులు కూడా దేశ భావాలను విస్మరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ కళాకారులతో వేదికలను పంచుకుంటున్నారు. AICWA ఈ కంపెనీలు, వ్యక్తులను పాకిస్తానీ ప్రతిభకు మద్దతు ఇవ్వడం మానేయాలని, దేశంతో నిలబడాలని పిలుపునిస్తోంది.

Exit mobile version
Skip to toolbar