Site icon Prime9

Abir Gulaal Movie Ban: పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటన – బాలీవుడ్‌ సినిమాపై నిషేధం

Bollywood Abir Gulaal Movie Banned In India: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఘటనపై యావత్‌ దేశాన్ని కదిలించింది. సామాన్య జనం నుంచి సినీ, రాజకీయ సెలబ్రిటీలు ఈ ఉగ్రవాద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇక భారత ప్రభుత్వం కూడా పాకిస్తాన్‌కు వరుసగా షాక్‌ ఇస్తుంది. ఈ ఘటన అనంతరం మోదీ ప్రభుత్వం పాకిస్తాన్‌తో ఉన్న ఒప్పందాలను వరుసగా క్యాన్సిల్‌ చేస్తోంది. ఇప్పటికే సింధు నది జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. మరోవైపు క్రికెట్‌లో పాక్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

 

ఇకపై పాకిస్తాన్‌-భారత్‌ మధ్య ద్వేపాక్షిక సిరీస్‌లు ఉండబోవని బీసీసీఐ ప్రకటించింది. ఇక ఇండియాలో ఉన్న పాకిస్తానీలు 48 గంటల్లో భారత్‌ నుంచి వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా దీని ప్రభావం బాలీవుడ్‌ సినిమాలపై కూడా పడింది. పాకిస్తానీ నటీనటులు నటించిన సినిమాలన్నింటిపై ఇక్కడ నిషేధం విధించింది భారత ప్రభుత్వం. తాజాగా ‘అబీర్‌ గులాల్‌’ బాలీవుడ్‌ చిత్రంపై భారత్‌ బ్యాన్‌ విధించింది. ఈ మేరకు కేంద్ర సమాచారం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా భారత్‌లో విడుదల చేయకూడదని కేంద్ర సమాచార శాఖ నిర్ణయం తీసుకుంది.

 

అబీర్‌ గులామ్‌ సినిమాలో పాక్‌ నటుడు ఫహద్‌ ఖాన్‌ హీరోగా నటించాడు. ఇందులో బాలీవుడ్‌ నటి వాణీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. ఆర్తి ఎస్‌.బగ్డీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 9న విడుదలకు సిద్ధమవుతుంది. త్వరలోనే విడుదల ఉండగా.. పహల్గామ్‌ దాడి నేపథ్యంలో ఈ సినిమా నిషేధానికి గురైంది. వివేక్‌ అగర్వాల్‌, అవంతిక హారి, రాకేష్‌ సిప్పీ, ఫరూజీ ఖాన్‌ నిర్మించిన ఈ సినిమాలో రిద్ధి డోగ్రా, లీసా హైడన్‌, ఫరీదా జలాల్‌, పర్మీత్‌ సేతి, సోనీ రజ్దాన్‌ కీలక పాత్రలు పోషించారు. కాగా ఈ మూవీ ప్రకటన వచ్చినప్పటి నుంచి దీనికి వ్యతిరేకత మొదలైంది. పుల్వామా దాడి తర్వాత పాక్ నటులు ఇండియన్ సినిమాల్లో నటించడం నిషేధం. అయితే చాలా రోజుల గ్యాప్ తర్వాత పాక్ నటుడు ఫవాద్ నటించిన ఈ సినిమా తాజాగా పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో నిషేధం విధించారు.

 

 

Exit mobile version
Skip to toolbar