Site icon Prime9

‘Adhi Dha Surprisu’ Song Out: కాంట్రవర్సీ సాంగ్ ‘అదిదా సర్‌ప్రైజ్’.. స్పెషల్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్!

Adhi Dha Surprisu Full Video Song Released

Adhi Dha Surprisu Full Video Song Released

Robinhood Movie ‘Adhi Dha Surprisu’ Full Video Song Released: టాలీవుడ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’. ఇందులో నితిన్ సరసన శ్రీలీల నటించింది. అయితే ఈ సినిమా చిత్రంలోని ప్రత్యేక సాంగ్ ‘అదిదా సర్‌ప్రైజ్’ కాంట్రవర్సీగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సాంగ్‌లో కేతికా శర్మ నటించింది.

 

తాజాగా, ఈ సాంగ్‌పై మేకర్స్ అప్డేట్ ప్రకటించారు. ఈ స్పెషల్ సాంగ్ ఫుల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌పై కొన్ని స్టెప్పుల విషయంలో తీవ్ర వ్యతిరేకత రావడంతో పలు మార్పులు చేసి థియేటర్స్‌లో విడుదల చేశారు. మేకర్స్ అదే వెర్షన్‌ను రిలీజ్ చేశారు.  ఈ సినిమా మార్చి 28న థియేటర్స్‌లో విడెదలైంది. కంటెంట్ సరిగా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

 

ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది. తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ సంగీతం అందించగా.. రాజేంద్ర ప్రసాద్,వెన్నెల కిశోర్, మైమ్ గోపి, షైన్ టామ్ చాకూ, బ్రహ్మాజీ నటించారు. ఈ సినిమాలో ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించాడు. అయితే ఆయన క్రికెటర్‌గా చేసిన కెమియో సరదాగా అనిపించింది. కానీ స్టోరీకి తగిన విధంగా లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు.

 

ఇదిలా ఉండగా, ‘అదిదా సర్‌ప్రైజ్’ సాంగ్ వివాదంగా మారింది. ఈ పాటను చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ సాంగ్‌పై తీవ్రంగా విమర్శలు రావడంతో స్టెప్‌ను తొలగించారు. అయితే, ఇవాళ రిలీజ్ చేసిన వీడియో సాంగ్‌లో వివాదాస్పదంగా మారిన ఆ స్టెప్పు కనిపించకుండా చేశారు. ఈ సాంగ్‌‌లో ఆ స్టెప్పు ఉందో లేదో తెలుసుకునేందుకు ప్లే బటన్ క్లిక్ చేసి మీరూ చూడండి.

Adhi Dha Surprisu Video | Robinhood | Nithiin, Sreeleela, Ketika Sharma, Venky Kudumula, GV Prakash

Exit mobile version
Skip to toolbar