Prime9

Sydney Sweeney: తను స్నానం చేసిన నీటితో సబ్బు తయారి – నటి వింత బిజినెస్‌, ధరెంతంటే..

Sydney Sweeney Made Soap With Her Bathwater: హాలీవుడ్‌ నటి సిడ్ని స్వీనీ ఓ కొత్త బిజినెస్‌ ప్రారంభించింది. తను స్నానం చేసే నీటితో సబ్బు తయారు చేసి విక్రయిస్తోంది. ఇక ఈ సబ్బు విలువ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. నటి సిడ్ని స్వీనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అమెరికా పాపులర్‌ బోల్డ్‌ యాక్ట్రస్‌లో ఆమె ఒకరు. ఎన్నో హాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన ఆమె కొన్ని సినిమాల్లో నగ్నంగానూ కనిపించింది షాకిచ్చింది.

 

2009లో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె తనదైన నటన, బోల్డ్‌ రోల్స్‌తో అతి తక్కువ టైంలోనే స్టార్‌ నటిగా ఎదిగింది. అయితే తాజాగా ఈ భామ ఆసక్తికర విషయం చెప్పింది. ఇటీవలో ఓ హాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో తన కొత్త వ్యాపారం గురించి చెప్పి అందరికి షాకిచ్చింది. తాను త్వరలోనే ‘సిడ్నిస్‌ విత్‌ వాటర్‌ బ్లిస్‌’ మార్కెట్లోకి కొత్త సబ్బును పరిచయం చేయబోతున్నానని చెప్పింది. అది స్వయంగా తాను స్నానం చేసిన నీటితో ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పింది. సిడ్ని స్వయంగా తాను స్నానం చేసిన నీటిని భద్రపరిచి, దాంతో సబ్బు తయారు చేశానని చెప్పింది.

 

అంతేకాదు వాటిని త్వరలోనే మార్కెట్లో లాంచ్‌ చేయబోతున్నట్టు చెప్పింది. అది కూడా పురుషులకు మాత్రమేనట. ‘మెన్స్‌ నేచురల్‌ సిడ్నీస్‌ బాత్‌ వాటర్‌ బ్లాస్‌’ పేరుతో ఈ సోప్‌ను లాంచ్‌ చేస్తోంది. దీని ధర రూ. 8 డాలర్లు అట. అంటే మన ఇండియన్‌ కరెన్సీ దీని ధర రూ. 700 అట.  జూన్ 6వ తేదీని నుంచి ఈ సబ్బులు మార్కెట్లోకి రాబోతున్నట్టు చెప్పింది. కేవలం 5వేల సబ్బులు మాత్రమే తయారు చేసినట్టు ఆమె స్పష్టం చేసింది. కాగా తన అభిమానుల డిమాండ్ మేరకే తను ఈ నిర్ణయం తీసుకున్నట్టు  ఆమె చెప్పడం గమనార్హం.  ఈ మేరకు నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ కూడా షేర్‌ చేసింది. ఇది తెలిసి అంతా షాక్‌ అవుతున్నారు. స్నానం చేసిన నీటితో సబ్బు తయారు చేయడమేంటి? వాటిని మార్కెట్లో అమ్మడమేంటని ముక్కున వేలేసుకుంటున్నారు.

Exit mobile version
Skip to toolbar