Prime9

Tamannah Mysore Sandal Controversy: మైసూర్‌ శాండల్‌కు తమన్నా ప్రచారం అవసరం లేదు.. నటి రమ్య కామెంట్స్‌

Actress Ramya upset For Tamannah as KSDL brand ambassador: మిల్కీ బ్యూటీ తమన్నాను ప్రముఖ బ్రాండ్‌ మైసూర్‌ శాండల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియామకమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం రెండేళ్ల ఒప్పందం చేసుకుంది. సుమారు రూ. 6.2 కోట్ల పారితోషికంతో తమన్నాను రెండేళ్ల పాటు కర్ణాటక సోప్‌ డిటర్జేంట్స్‌ లిమిటెడ్‌ (KSDL) అంబాసిడర్‌గా నియమించుకుంది. అయితే తమన్నాను మైసూర్‌ శాండల్‌ అంబాసిడర్‌గా నియమించడంపై కన్నడీగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది.

 

కర్ణాటకతో ఏమాత్రం సంబంధం లేదని తమన్నాను తమ బ్రాండ్‌కు అంబాసిడర్‌ నియమించడం ఏంటనీ, కర్ణాటక వాళ్లను నియమించాలనే డిమాండ్స్‌ వస్తున్నాయి. రష్మిక మందన్ఆన, రుక్మిణి వసంత్‌, శ్రీనిధి శెట్టి వంటి ఎంతో మన హీరోయిన్లు ఉన్నారని వాళ్లని కాదని తమన్నా నియమించమేంటని ప్రశ్నిస్తున్నారు. తమన్నాకు దక్షిణాదితో పాటు ఉత్తారదిలోనూ మంచి మార్కెట్‌ ఉందని, ఆమెను నియమిస్తూ నార్త్‌లోనూ తమ బ్రాండ్‌కు గుర్తింపు వస్తుందనే ఉద్దేశంతోనే ఆమె నియమించినట్టు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయినప్పటి ప్రభుత్వం తీరుపై సాధారణ ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీల, రాజకీయ వర్గాలను నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

 

ఈ మేరకు నటి, మాజీ ఎంపీ రమ్య అసమ్మతి వ్యక్తం చేశారు. ప్రతి కన్నడిగుడు మైసూర్‌ శాండల్‌ సోపు రాయబారి అని అన్నారు. ఈ పాత్ర కోసం తమన్నాకు కోట్లాది రూపాయాలకు చెల్లించడాన్ని ఆమె వ్యతిరేకించారు. సెలబ్రిటీల ప్రచారం కోసం ప్రజల సొమ్ము ఖర్చ చేయడం తగదని ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. సబ్బు రుద్దితే తెల్లగా కారని, సెలబ్రిటీలు చెబితే ప్రజలు ఇన్‌ఫ్లూయేన్స్‌ అయ్యే రోజులు పోయాయని, ఇదంత ఒకప్పుడన్నారు. ఒక ఉత్పత్తి నిజంగా విలువైనదైతే అందరూ కొంటారన్నారు. మైసూర్‌ శాండల్‌పై ఇప్పటికే ప్రజల్లో ఎంతో నమ్మకం ఉందన్నారు. మైసూర్‌ శాండల్‌కు తమన్నా ప్రచారం అవసరం లేదని రమ్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 

Exit mobile version
Skip to toolbar