Site icon Prime9

Actress Archana Kottige: క్రికెటర్‌ని పెళ్లాడిన నటి అర్చన – ఫోటోలు వైరల్‌

Actress Archana Kottige Married Cricketer BR Sharath: సినీ నటి అర్చన కొట్టిగె(Archana Kottige) పెళ్లి చేసుకుంది. క్రికెటర్‌ శరత్‌తో ఆమె ఏడడుగులు వేసింది. పలు కన్నడ సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది ఈ భామ. ప్రస్తుతం 28 ఏళ్ల వయసులో ఉన్న అర్చన తన రాష్ట్రానికి చెందిన ఐపీఎల్‌ క్రికెట్‌ శరత్‌ బీర్‌ను ఇవాళ బుధవారం (ఏప్రిల్‌ 23)న పెళ్లి చేసుకుంది. అనంతరం జరిగిన గ్రాంగ్‌ రిసెప్షన్‌ వెడ్డింగ్‌కి కాంతార నటి సప్తమి గౌడ హాజరైంది. క్రికెట్‌ శరత్‌ తరపు ప్రసిద్ధ కృష్ణ యాష్‌ దయాల్‌, దేవదత్‌ పడిక్కల్‌ తదితరులు హాజరయ్యారు.

 

అర్చన 2018 నుంచి కన్నడ పరిశ్రమలో నటిగా కొనసాగుతుంది. డియల్‌ సత్య, యెల్లో గ్యాంగ్స్‌, విజయానంద్‌, హాస్టల్‌ హుడుగురు బేకాగిద్దరే వంటి తదితర సినిమాల్లో ఆమె నటించింది. ఇక శరత్‌ బీర్‌ విషయానికి వస్తే.. కర్ణాటక తరపున అండర్‌-23 ఆడిన శరత్‌.. వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌గా రాణించాడు. గతేడాది నుంచి ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్ష్‌ తరపున ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో అతడి కనీస ధర రూ. 20 లక్షలతో గుజరాత్‌ టైటాన్ష్‌ ఇతడిని కోనుగోలు చేసింది. కానీ తుది జట్టులో మాత్రం అవకాశం దక్కించుకోలేకపోయాడు.

Exit mobile version
Skip to toolbar