Actress Annapurna Comments on Commitment in Tollywood: ఏ ఇండస్ట్రీలో ఆఫర్స్ కావాలంటే కమిట్‌మెంట్ ఇవ్వాల్సిందేనని, లేదంటూ పక్కన పెట్టేస్తారంటూ ఎందరో నటీమణులు ఈ కామెంట్స్ చేశారు. మీటూ ఉద్యమం తర్వాత చాలా మంది బయటకు వారు ఎదుర్కొన్న వేధింపులపై నోరు విప్పారు. ఇప్పటికీ ఏదోక ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాధితులు బయటకు వస్తూనే ఉన్నారు.
అయితే తెలుగు ఇండస్ట్రీలో కమిట్‌మెంట్‌పై సీనియర్ నటి అన్నపూర్ణ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌తో ముచ్చటించిన ఆమె ఆసక్తికర విషయాలు చెప్పారు.
ఇండస్ట్రీలో కమిట్‌మెంట్‌పై ఆమెను ప్రశ్నించగా ఇలా చెప్పుకొచ్చారు. “కమిట్‌మెంట్ అడుగుతున్నారంటూ కొందరు చెబుతున్నారు. ఏదో మీడియాలో హైలెట్ అవ్వడానికే వాళ్లు ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారనిపిస్తోంది. ఆ రోజుల్లో విలువలతో కూడిన కమిట్‌మెంట్స్ ఉండేవి. నేను తక్కువ రెమ్యునరేషన్ తీసుకునేదాన్ని.
కాబట్టి నన్ను ఆ ఉద్దేశంతో ఎవరూ చూడలేదు. ఇండస్ట్రీలో మనందరిది. దానిని కరెక్ట్ వినియోగించుకుంటే మంచి అవకాశాలు వస్తాయి. టాలెంట్ ఉన్నవాళ్లకు అవకాశాలు రావనేది నేను నమ్మను. ఏదో మీడియాలో హైలెట్ అవ్వడానికి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఎవరూ బలవంతం చేయరు. వారి ఇష్టంగానే జరుగుతుంది” అంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా గతంలో అన్నపూర్ణ కాస్టింగ్ కౌచ్‌పై ఎన్నోసార్లు మాట్లాడారు. అప్పుడు కూడా ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.