Site icon Prime9

Actor Mohan Lal: ఒబెసిటీపై పోరాటం..చిరు, రజినీలకు హెల్దీ ఇండియా నిర్మిద్దామని నామినేట్

Actor Mohan Lal Nominates chiru, rajini for campaign against obesity: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల మన్ కీ బాత్‌లో ఒబెసిటీ క్యాంపెయిన్‌ను ప్రకటించగా.. ఇందులో పది మంది ప్రముఖులు మోదీ నామినేట్ చేశారు. వీరిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా, జమ్మూకశ్మీర్ సీఎం ఒబర్ అబ్దుల్లా, యాక్టర్ దినేశ్ లాల్ యాదవ్ లియాస్ నిరామువా, షూటర్ మను బాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, సినీ నటులు మోహన్ లాల్, మాధవన్, సింగర్ శ్రేయా ఘోషల్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి ఉన్నారు.

2022 డబ్లూహెచ్ఓ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో 250 కోట్ల మందికిపైగా అధిక బరువుతో ఉన్నారని తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఎనిమిది మందిలో కనీసం ఒకరు ఒబెసిటీ సమస్యతో ఉన్నారన్నారు. దీనిని నిర్మూలించాల్సిన బాధ్యత అందరిది అని, మనం తీసుకునే ఫుడ్‌లో వంటనూనెను 10శాతం వరకు తగ్గించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

తాజాగా, సినీ నటుడు మోహన్ లాల్ స్పందించారు. దేశంలో 10 మంది పేర్లలో తన పేరు కూడా ప్రస్తావించడంతో హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మోహన్ లాల్ సైతం హెల్దీ ఇండియా నిర్మిద్దామని 10 మంది సినీ ప్రముఖులను నామినేట్ చేశాడు. ఇందులో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ఉన్ని ముకుందన్, టొవినో థామస్ ఉండగా.. హీరోయిన్లు మంజు వారియర్, కల్యాణి ప్రియదర్శన్, డైరెక్టర్ రవి, ప్రియదర్శన్‌లు ఉన్నారు.

ఒబెసిటీపై పోరాటం చేసేందుకు పిలుపునిచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. వినూత్న ఆలోచనలతో దేశాన్ని ఆరోగ్యంగా ముందుకు నడిపించాలన్నారు. వంటనూనె 10శాతం తగ్గడంతోనే మార్పు మొదలువుతుందన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో నా వంతుగా 10 మందిని నామినేట్ చేస్తున్నానని వెల్లడించారు. ఆరోగ్యవంతమైన దేశాన్ని నిర్మిద్దామంటూ 10 మంది సినీ ప్రముఖులను మోహన్ లాల్ నామినేట్ చేశారు.

Exit mobile version
Skip to toolbar