Actor Vishal : దక్షిణాది సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు విశాల్ ఒకరు. ఈయన తమిళంతో పాటు తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. తమిళంతో పాటు ఈయనకు తెలుగులో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగులో కూడా పలు సినిమాలను రిలీజ్ చేసి మంచి హిట్లు అందుకున్నాడు విశాల్. అయితే ఇటీవల కాలంలో ఆయన షూటింగ్‌లో గాయపడటం సర్వసాధారణంగా మారిపోయింది. ఇప్పటికే పలుమార్లు విశాల్ కి షూటింగ్ స్పాట్ లో ప్రమాదాలు జరిగాయి. ఇప్పుడు తాజాగా ఏకంగా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు విశాల్.
అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తన కొత్త సినిమా షూటింగ్‌లోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఘటన ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది షూటింగ్ సెట్‌లో చోట చేసుకున్న ఘటన ఇప్పుడు అందరిని షాక్‌కి గురి చేస్తుంది. విశాల్ ప్రస్తుతం `మార్క్ ఆంటోని` చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఓ సెట్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. అందులో ట్రక్ అదుపు తప్పింది. సెట్‌లో కింద పడిపోయిన విశాల్ వైపు అదుపు తప్పి ట్రక్ వేగంగా దూసుకొచ్చింది. ట్రక్ వస్తుండటాన్ని గమనించిన టీమ్ మెంబర్స్ ఆయన్ని పక్కకి లాగారు. దీంతో ప్రాణాలతో బయటపడ్డారు.
దేవుడి దయ వల్ల అంతా క్షేమంగానే ఉన్నాం – విశాల్
ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. `కొద్ది క్షణాలు, కొన్ని అంగుళాల దూరంలో నా చావు కనిపించింది. థ్యాంక్ గాడ్, ఈ ప్రమాదం తర్వాత రక్షణ వాతావరణంలో తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నాం` అని తెలిపారు విశాల్. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, అంతా క్షేమంగానే ఉన్నారని తెలిపారు విశాల్. ఈ మేరకు ఆ ఘటనకు సంబంధించిన వీడియోని పంచుకున్నారు. దీనిపై అభిమానులు స్పందిస్తున్నారు. మరోవైపు నటుడు దీపక్ పరదేశ్ స్పందిస్తూ, చూడ్డానికే ఇది చాలా భయంకరంగా ఉంది. నీకేం కాలేదు, అదే చాలు. అంతా క్షేమంగానే ఉన్నారని భావిస్తున్నాం` అని రిప్లైగా ట్వీట్ చేశారు.
Jus missed my life in a matter of few seconds and few inches, Thanks to the Almighty
Numb to this incident back on my feet and back to shoot, GB pic.twitter.com/bL7sbc9dOu
— Vishal (@VishalKOfficial) February 22, 2023
గతంలో విశాల్ `లాఠి` సినిమా సమయంలోనూ విశాల్ గాయపడ్డారు. షూటింగ్‌లో ఆయన కాలుకి గాయమైంది. అంతకు ముందు `చక్ర` సినిమా సమయంలోనే యాక్షన్స్ చేసే క్రమంలో తలకి గాయమైంది. ఇలా తరచూ విశాల్ గాయాల బారిన పడుతున్నారు. యాక్షన్ సీక్వెన్స్ లో డూప్ లేకుండా చేయడమే అందుకు కారణమని అంటున్నారు.
ఇక ప్రస్తుతం విశాల్ నటిస్తున్న `మార్క్ ఆంటోని` చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. రీతూ వర్మ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. అలానే ఎస్ జే సూర్య, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందుతుంది. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. పీరియడ్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశాల్.. గ్యాంగ్ స్టర్ తరహా పాత్రలో కనిపించబోతుండటం విశేషం. ఆ ప్రమాదం జరిగిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/