Abhishek Bachchan Says He Wanted to Quit Acting: అభిషేక్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండియన్ మూవీ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేకపోయాడు. బిగ్‌బి తనయుడి స్టార్ స్టేటస్ సైతం అతడికి ప్లస్ కాలేకపోయింది. హీరోగా బాలీవుడ్ ఎలేద్దామని వచ్చిన అభిషేక్‌కి తరచూ నిరాశే ఎదురవుతోంది. పరిశ్రమలో అడుగుపెట్టి దశాబ్ధాలు అవుతున్న ఇప్పటికీ తనని తాను నటుడిగా ప్రూవ్ చేసుకునే దగ్గరే ఆగిపోయారు.
ప్రస్తుతం ఆడపదడప చిత్రాలు చేస్తూ కెరీర్‌ని నెట్టుకొస్తున్నాడు. తాజాగా అతడు నటించి చిత్రం ‘బీ హ్యాపీ’. అమెజాన్ ప్రైం వేదికగా ఈ మూవీ విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అభిషేక్ ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ తాను బాలీవుడ్‌ని వదిలేద్దామని అనుకున్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కానీ తన తండ్రి వల్లే ఇంకా ఇండస్ట్రీలో ఉన్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
“ఎంత ప్రయత్నించిన నటుడిగా ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయాను. నటుడిగా నా కెరీర్‌లో ఎన్నో ఎత్తపల్లాలు చూశాను. విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలనేది నా కోరిక. అలాగే ఎన్నో విభిన్న సినిమాలు చేసినా.. ఆశించిన గుర్తింపు మాత్రం పొంలేదకపోయాను. ఈ విషయమై ఎన్నోసార్లు బాధపడ్డాను. ఈ క్రమంలో సినిమాలు వదిలేసి.. ఇండస్ట్రీ నంచి దూరంగా వెళ్లిపోవాలనిపించేది. ఇది విషయాన్ని నాన్నకి(అభిషేక్ బచ్చన్) చెప్పాను” అని అన్నారు.
“నాన్నవల్లే సినిమాల్లోకి వచ్యాను. యాక్టింగ్ మానేయాలని నిర్ణయించుకున్నాక అదే విషయాన్ని నాన్నకు చెప్పాను. అప్పుడాయన ఒక మాట చెప్పారు. ‘తండ్రిలా కాదు ఒక నటుడిగా నీకో సలాహా ఇస్తాను. ఇప్పుడే నీ ప్రయాణం మొదలైంది. ఇంకా నువ్వు ఎంతో దూరం వెళ్లాల్సి ఉంది. ఈ ప్రయాణంలో సవాళ్లు ఎదురువుతాయి. వాటి నుంచి నువ్వు కొత్త పాఠాలు నేర్చుకోవాలి. ప్రతి సినిమా నుంచి ఏదోక విషయం నేర్చుకుంటూ ముందుకు సాగినప్పుడే నువ్వు అనుకున్న స్థాయికి చేరుకుంటావు. కాబట్టి పోరాడుతూనే ఉండు’ అని అన్నారు. అప్పుడాయన మాటలు నాలో ధైర్యాన్ని నింపాయి. జీవితం వైఫల్యం లేకుండ ఎవరూ విజయం సాధించలేరని అర్థమైంది. ఇక ఆయన సలహాతో నటుడిగానే కొనసాగాలని గట్టి నిర్ణయించుకున్నా” అని అభిషేక్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి.