Site icon Prime9

Aamira Khan: మహాభారతంలో ఆ పాత్రంటే ఇష్టం – అది నన్నేంతో ప్రభావితం చేసింది

Aamir Khan About Mahabharat Movie: ఆమిర్‌ ఖాన్‌ తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ మహాభారతంపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇతిహాసాన్ని భారీ స్థాయిలో భీన్నమైన ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల ముందకు తీసుకురావాలనేది ఆమిర్‌ కోరిక అని, ఈ మహాభారతం కోసం ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్నట్టు ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పుకొచ్చారు. ఇక తాజాగా జరిగిన ఇండియా@2047 సమ్మిట్‌లో ఆమిర్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ మహాభారతం గురించి ప్రస్తావించారు.

 

ఇందులో మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్ర తనని ప్రభావితం చేసిందని, అదే పాత్ర చేయాలనుకుంటున్నట్టు మనసులో మాట బయటపెట్టారు. “మహాభారతంను తెరకెక్కించాలనే నా కల. ఇది అత్యంత భారీ ప్రాజెక్ట్‌. దీనికి కోసం ఎంతో కష్టపడాలి. కానీ ఇలాంటి సినిమాలు మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచవు.. కానీ, మీరు మహాభారతాన్ని నిరాశపరచవచ్చు” అని అన్నారు. మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్ర తనని ఎంతో ప్రభావితం చేసిందన్నారు. ఆ పాత్ర అంటే నాకు ఇష్టం. ఇందులో నేను అదే చేయాలని అనుకుంటున్నా. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్‌. దీని గురించి ఇప్పుడే ఏం చెప్పలేను” అని అన్నారు.

 

అయితే గతంలో ఆయన ఈ ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడుతూ.. ఇది భారీ ఫ్రాంచైజీగా రూపొందిస్తున్నట్టు చెప్పారు. అన్ని భాగాలు ఒకేసారి చిత్రీకరిస్తామన్నారు. ఒక్కో భాగానికి వివిధ దర్శకులు పని చేస్తారన్నారు. అప్పట్లో ఈ సినిమాకు నిర్మాతగా ఉండాలనుకుంటున్న ఆయన ఇప్పుడు ఇందులో శ్రీకృష్ణుడి పాత్ర పోషిస్తానని చెప్పడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కాగా ఆమిర్‌ నటించిన ‘సితారే జమీన్‌ పర్‌’ మూవీ విడుదలకు సిద్దమౌతుంది. జాన్‌ 20న ఈ మూవీ థియేటర్లోకి రానుంది. ఆ తర్వాత ఆయన మహాభారత్‌ ప్రాజెక్ట్‌పై ఫోకస్‌ పెట్టనున్నాడు. ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ మొదలు పెట్టి అతిత్వరలోనే ఈ భారీ ప్రాజెక్ట్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar