Site icon Prime9

Tollywood Star Hero: చైన్ స్మోకర్ గా మారిన స్టార్ హీరో.. సెట్ లో యాష్ ట్రే పట్టుకోవడానికి ఇద్దరు అసిస్టెంట్లు.. ?

Tollywood Star Hero: ఇండస్ట్రీ అంటేనే ఒక పెద్ద వలయం. ఇక్కడ రీల్ కోసం కొన్ని చెడు అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది రీల్ కోసం అలవాటు చేసుకొని.. రియల్ గా బానిసలుగా మారుతున్నారు. ఇండస్ట్రీలో చైన్ స్మోకర్ ఎవరు అని అంటే టక్కున మహేష్ బాబు అని చెప్పుకొచ్చేస్తారు. ఒకప్పుడు సెట్ లో ఆయన తాగినన్ని సిగరెట్లు ఇంకెవరు తాగేవారు కాదట. కానీ, ఉన్నకొద్దీ మహేష్ .. ఆ అలవాటును మార్చుకున్నాడు. ఒక పుస్తకం చదివి సిగరెట్ తాగే అలవాటును మానేసినట్లు మహేష్ ఎన్నిసార్లు చెప్పుకొచ్చాడు.

 

గుంటూరు కారం సినిమాలో మహేష్ తాగిన బీడీ కూడా ఒరిజినల్ కాదు అని మేకర్స్ తెలిపారు. అంత చైన్ స్మోకర్ అయినా మహేషే ఈ అలవాటు మానేస్తే.. ఆయనను మించి ఇంకో హీరో చైన్ స్మోకర్ గా మారినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక స్టార్ హీరో.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ ఉన్నాడు. అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. పెద్ద స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నాడు. అలాంటి ఒక హీరో సిగరెట్లకు బానిసగా మారినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది.

 

సీన్ కి ముందు ఒక సిగరెట్.. సీన్ తరువాత ఒక సిగరెట్. బ్రేక్ ఇచ్చినప్పుడు సిగరెట్ తాగడం నుంచి మొదలై.. సిగరెట్ తాగడానికే బ్రేక్ అడుగుతున్నాడట. సదురు హీరో ప్రవర్తన నిర్మాతలకు అస్సలు నచ్చడం లేదని టాక్. రోజుకు కనీసం ఐదారు పెట్టెలు అయినా ఖాళీ అవ్వాల్సిందేనట. అంతేకాకుండా ఈ సిగరెట్ తాగే హీరో.. కేవలం యాష్ ట్రేస్ పట్టుకోవడానికే ఇద్దరు అసిస్టెంట్స్ ను పెట్టుకున్నాడట. ఎక్కడకు వెళ్లినా వీరిద్దరూ పక్కనే ఉంటున్నారట.

 

హా సర్లే.. ఈ అలవాటు ఎవరికీ లేదు. అతని పర్సనల్ విషయాలు నిర్మాతలకు ఎందుకు అని అంటే.. ఈ అలవాటు వలన హీరోగారి ఆరోగ్యం క్షీణించడం మొదలైందట. దీంతో ఫేస్ లో మార్పులు కనిపిస్తున్నాయని, దీనివలన తన సినిమాకు ఏదైనా నష్టం వాటిల్లుతుందని నిర్మాత భయపడుతున్నాడట.అందులో డాక్టర్స్ కూడా ఈ అలవాటును మానుకోమని హీరోకు చెప్పినా వినడం లేదని ఇన్ సైడ్ టాక్. ఇక ఈ విషయం తెలియడంతో ఆ హీరో ఎవరు అని సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ మొదలైంది. మా హీరో కాదు.. మా హీరో కాదు అని ప్రభాస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. మరి టాలీవుడ్ లో కొత్త చైన్ స్మోకర్ ఎవరై ఉంటారబ్బా..

Exit mobile version
Skip to toolbar