Site icon Prime9

UPSC: రేపటితో ముగియనున్న యూపీఎస్సీ గడువు

upsc prime9news

upsc prime9news

UPSC: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ 2023 పోస్టుల భర్తీ కోసం అధికారిక నోటిఫికేషన్‌ను ఎప్పుడో విడుదల చేసింది.ఆసక్తి గల అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ అంటే ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పెట్టుకోవచ్చు.UPSC ESE నోటిఫికేషన్ 2023కి సంబంధించిన విద్యార్హతలు,వయోపరిమితి,దరఖాస్తు మొదలైన అన్ని వివరాలను కింద చదివి తెలుసుకుందాం.పోస్టుల భర్తీకి సంబంధించి ఈ ప్రక్రియ సెప్టెంబరు 14న ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ 2022 అక్టోబర్ 04 వరకు ఉంది.అంటే ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ అనేది రేపటితో ముగియనుంది.

సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 327 పోస్టులను భర్తీ చేయనున్నారు.

కావలిసిన విద్యార్హతలు :
సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి :

దరఖాస్తు పెట్టుకోవడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు వరకు ఉండాలి.జనరల్ ,ఓబీసీ అభ్యర్థుల రూ.200 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు ఎలాంటి పరీక్ష ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.

Exit mobile version