Site icon Prime9

UPSC Notification: మెడికల్ ఆఫీసర్ల నియామకానికి యూపీఎస్సీ నోటిఫికేషన్

UPSC Notification

UPSC Notification

UPSC Notification: యూపీఎస్సీ మెడికల్ ఆఫీసర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం లోని పలు విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు. మొత్తం 1,261 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. యూపీఎస్సీ కంబైన్డ్‌ మెడిక్‌ సర్వీసెస్‌ పరీక్ష(UPSC CMS)కు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్‌ 19న ప్రారంభమైన ఈ దరఖాస్తుల ప్రక్రియ మే 9న సాయంత్రం 6గంటల వరకు ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 16న దేశవ్యాప్తంగా 41 సెంటర్లలో యూపీఎస్సీ సీఎంఎస్ పరీక్ష నిర్వహించనున్నారు.

 

నోటిఫికేషన్ వివరాలివే..(UPSC Notification)

మొత్తం పోస్టులు 1261 అందుబాటులో ఉన్నాయి. వీటిలో కేటగిరీ-1 లో మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ (జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ సబ్-క్యాడర్ ఆఫ్ సెంట్రల్ హెల్త్ సర్వీస్) 584 పోస్టులు ఉన్నాయి.

కేటగిరి-2లో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ (రైల్వే) పోస్టులు 300 కాగా.. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌) పోస్టులు ఒకటి చొప్పున భర్తీ చేయనున్నారు.

దీంతో పాటు జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 (ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌)లో 376 పోస్టులు ఉన్నాయి.

 

అర్హతలు, ఫీజుల వివరాలు

ధరఖాస్తు కోసం upsconline.nic.in ను సంప్రదించాలి.

ఆగస్టు 1, 2023 నాటికి అభ్యర్థుల వయస్సు 32 కు మించరాదు. అభ్యర్థులు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుం రూ. 200 గా నిర్ణయించారు. మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు రుసుము లో మినహాయింపు ఉంటుంది. యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో మొదట ఓటీఆర్‌ చేసుకోవాలి.

ఆ తర్వాత దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజును నెట్‌ బ్యాంకింగ్‌, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా చెల్లించవచ్చు.

జూన్‌లో ఈ-అడ్మిట్‌కార్డులు.. ఫలితాలను ఆగస్టు 23న విడుదల చేస్తారు.

రాత పరీక్ష 500 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ 100 మార్కులు ఉంటాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్

ఆబ్జెక్టివ్‌ రూపంలో జరిగే ఈ పరీక్షలో నెగెటివ్‌ మార్కులు ఉంటాయి.

 

ధరఖాస్తు కోసం క్లిక్ చేయండి

Exit mobile version