SBI Recruitment: ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ బ్యాంక్ సిబ్బంది కోసం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఒప్పంద ప్రాతిపదికన ఈ నియామకాలను చేపట్టనున్నట్టు ప్రకటించింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దాదాపు 1000 కి పైగా నియామకాల కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
అభ్యర్ధులు గతంలో బ్యాంకుల్లో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఎస్ బీఐ అధికారికి వెబ్ సైట్ https:sbi.co.in/ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 30 చివరి తేదీగా ఎస్ బీఐ పేర్కొంది.
నోటిఫికేషన్ వివరాలు..(SBI Recruitment)
మొత్తం పోస్టులు 1031. ఛానల్ మేనేజర్ సూపర్ వైజర్, ఛానల్ మేనేజర్ ఫెసిలిటేటర్ , సపోర్ట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
అభ్యర్థుల వయస్సు ఏప్రిల్ , 2023 నాటకి కనీసం 60 ఏళ్లు. గరిష్టంగా 63 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
దేశంలో ఎక్కడా కేటాయించిన ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఏటీఎం ఆపరేషన్స్ లో పనిచేసిన అనుభవం కలిగిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
వచ్చిన అప్లికేషన్స్ ను షార్ట్ లిస్ట్ చేసి వాటిలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అనంతరం సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వూ ఆధారంగా పోస్టింగ్ ఇస్తారు.
ఛానల్ మేనేజర్ ఫెసిలిటేటర్ జీతం రూ. 36, 0000, ఛానెల్ మేనేజర్ సూపర్ వైజర్ జీతం రూ. 41,000, సపోర్ట్ ఆఫీసర్ జీతం రూ. 41,000 లుగా ఉంది.