Prime9

PGECET Entrance Exams: నేటి నుంచి పీజీఈసెట్ పరీక్షలు.. జూన్ 19 వరకు నిర్వహణ

PGECET Entrance Exams from Today: రాష్ట్రంలో పీజీ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు సంబంధించి పీజీఈసెట్- 2025 ఆన్ లైన్ ఎంట్రెన్స్ టెస్ట్ నేటి నుంచి జరగనున్నాయి. ఈనెల 19 వరకు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫలితాల అనంతరం పీజీఈసెట్ లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా రాష్ట్రంలోని యూనివర్శిటీలు, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, ఏరోస్పేస్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, బయోటెక్నాలజీ, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ, మెటలర్జికల్, మైనింగ్, నానో టెక్నాలజీ, జియో అండ్ జియో ఇన్ఫార్మాటిక్స్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫార్మసీ, టెక్స్ టైల్ టెక్నాలజీ వంటి కోర్సుల్లో ప్రవేశానికి ఎంట్రెన్ పరీక్ష నిర్వహిస్తున్నారు.

 

కాగా 19 విభాగాల్లోని ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎం ఆర్క్, గ్రాడ్యుయేట్ లెవల్ ఫార్మ్ డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. అయితే గత నాలుగేళ్ల కంటే ఈ ఏడాది పీజీఈసెట్ కు ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయని ఉన్నత విద్యామండలి వెల్లడించింది. గతేడాది 22,712 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. ఈ ఏడాది 25,334 అప్లికేషన్లు వచ్చాయి. అంటే గతేడాది కంటే 2622 అప్లికేషన్లు ఎక్కువగా వచ్చాయి.

 

Exit mobile version
Skip to toolbar