Site icon Prime9

Kotak Kanya Scholarship 2022: కోటక్ కన్యా స్కాలర్‌షిప్ 2022

kotak prime9news

kotak prime9news

Kotak Kanya Scholarship 2022: ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాలకు ప్రతిభ ఉండి చదువుకోవడానికి డబ్బులు లేని మహిళ విధ్యార్ధులకు ఆర్ధిక సహాయం చెయ్యాలని కోటక్ బ్యాంక్ సంస్థ వారు ఒక అడుగుముందుకు వేసి యూనివర్సిటీలు, కాలేజీల్లో ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సులను చేయడానికి కోటక్ బ్యాంక్ వారు కన్యా స్కాలర్‌షిప్ అనే కొత్త ప్రోగ్రామ్‌ను మనముందుకు తీసుకొచ్చారు. కోటక్ మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ నుంచి CSR ప్రాజెక్ట్ కింద ఈ స్కాలర్‌షిప్‌లనుప ప్రవేశ పెట్టనున్నారు. అర్హత కలిగి యుండి ఎంపికైన మహిళ విధ్యార్ధులకు ఏడాదికి అక్షరాల రూ1.5లక్షల వరకు స్కాలర్ షిప్ అందజేయనున్నారు.

న్యాక్/ఎన్‌ఐఆర్‌ఎఫ్ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రొఫెషనల్ కోర్సుల్లో మొదటి ఏడాది గ్రాడ్యుయేషన్‌కు ప్రవేశానికి అర్హత గల మహిళ విధ్యార్ధులు ఈ స్కాలర్‌షిప్‌ కోసం ధరఖాస్తులు పెట్టుకోవచ్చు.

ఈ స్కాలర్‌షిప్‌ కు కావలిసిన అర్హతలు :
మహిళ విధ్యార్ధులు 12వ తరగతి/ ఇంటర్‌లో 75% కంటే ఎక్కువ మార్కులు ఉండాలి.
కుటుంబ సంవత్సర ఆదాయం రూ.3,20,000 లోపు మాత్రమే ఉండాలి.అంతక మించి ఎక్కువ ఉంటే ఈ స్కాలర్‌షిప్‌ కు అర్హులు కారు.
దీనికి సంబందించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి www.b4s.in/it/KKGS12
పైన ఉన్న లింక్ ద్వారా మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌ కు ఆన్‌లైన్‌లో సెప్టెంబర్ 30 లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు.

Exit mobile version