Bank Jobs: బ్యాంకింగ్ రంగంలో కొలువు సంపాదించడానికి చాలా మంది ప్రిపేర్ అవుతుంటారు. అలాంటి నిరుద్యోగులకు ప్రముఖ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. 1,172 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ బ్యాంక్ లో కొలువు సాధిస్తే వేతనం కూడా భారీగా ఉండనుంది. ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోంది.
గుడ్ న్యూస్.. (Bank Jobs)
బ్యాంకింగ్ రంగంలో కొలువు సంపాదించడానికి చాలా మంది ప్రిపేర్ అవుతుంటారు. అలాంటి నిరుద్యోగులకు ప్రముఖ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. 1,172 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ బ్యాంక్ లో కొలువు సాధిస్తే వేతనం కూడా భారీగా ఉండనుంది. ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోంది.
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ భారీగా ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,172 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇందులో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు 136 కాగా.. ఎగ్జిక్యూటివ్ (కాంట్రాక్టు) ఉద్యోగాలు 1036 చొప్పున ఉన్నాయి. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎగ్జిక్యూటివ్ (కాంట్రాక్టు ప్రాతిపదికన) పోస్టులకు ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. జూన్ 7తో ముగియనుంది. అదే, స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు మాత్రం జూన్ 1 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పూర్తి వివరాలివే..
స్పెషల్ క్యాడర్..
స్పెషలిస్టు క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల మొత్తం 136. జూన్ 1 నుంచి 15వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
బ్యాంకులోని వివిధ విభాగాల్లో 84 మేనేజర్ పోస్టులు, 46 అసిస్టెంట్ జనరల్ మేనేజర్, 6 డిప్యూటీ జనరల్ మేనేజర్ చొప్పున మొత్తం 136 పోస్టులను భర్తీ చేస్తారు.
ఈ ఉద్యోగాలన్నింటికీ గతంలో పనిచేసిన అనుభవం తప్పనిసరి.
ఈ రెండు నోటిఫికేషన్లలో పేర్కొన్న ఉద్యోగాలకు హోదాలను బట్టి నెలకు వేతనం కనిష్ఠంగా రూ.29వేలు ఉండగా.. గరిష్ఠంగా రూ.1,55,000వరకు ఇవ్వనున్నారు.
స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
కాంట్రాక్ట్ పోస్టులు..
ఎగ్జిక్యూటివ్ (కాంట్రాక్టు) పోస్టులు మొత్తం 1036. వీటికి మే 24 నుంచి జూన్ 7వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు.
ఈ పోస్టులకు వయో పరిమితి 20 నుంచి 25 ఏళ్లు. ఏదైనా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
ఏడాది పాటు ఒప్పంద ప్రాతిపదికన మాత్రమే ఈ పోస్టులకు భర్తీ చేస్తారు. ఆ తర్వాత వారి పనితీరు ఆధారంగా ఏటా సర్వీసును పొడిగిస్తారు.
తొలి ఏడాది వేతనం రూ.29వేలు; రెండో ఏడాది రూ.31వేలు; మూడో సంవత్సరం రూ.34వేలు చొప్పున ఇస్తారు.
ఆన్‌లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎగ్జిక్యూటివ్‌లను ఎంపిక చేస్తారు.
ఆయా పోస్టులకు విభాగాల వారీగా ఖాళీలు, విద్యార్హతలు, వేతనం, ఎంపిక విధానం, పరీక్ష, కనీస వయస్సు, దరఖాస్తు రుసుం, పరీక్ష కేంద్రాలు తదితర వివరాలను ఈ కింద పేర్కొన్న నోటిఫికేషన్ల ద్వారా తెలుసుకోండి.