JEE Main 2023 Result: ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ 2023 సెషన్-2 ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. ఈ మేరకు ఫలితాలను విడుదల చేస్తున్నట్టు జాతీయ పరీక్షల సంస్థ అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించింది. ఏప్రిల్ 6 నుంచి 15 వరకు జరిగిన ఈ పరీక్షలఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు. స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం https://jeemain.nta.nic.in/ ను సంప్రదించవచ్చు.
జేఈఈ మెయిన్స్ సెషన్ 1 పరీక్షలు జనవరిలో జరగాయి. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 15 వరకు జరిగిన విషయం తెలిసిందే. అయితే, ఈ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన ఉత్తమ స్కోరు తీసుకొని ఎన్‌టీఏ ర్యాంకులు ప్రకటించింది. జేఈఈ మెయిన్‌లో కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి .. మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హత కల్పిస్తారు. తొలి విడత జేఈఈ మెయిన్ పరీక్షను 8.24 లక్షల మంది విద్యార్థులు రాశారు. రెండో విడత పరీక్షకు దాదాపు 9 లక్షల మంది వరకు హాజరయ్యారు.
ఫలితాల కోసం ఈ లింక్స్ ను క్లిక్ చేయండి
JEE(Main) 2023 Session 2 Result Link-1
JEE(Main) 2023 Session 2 Result Link-2
JEE(Main) 2023 Session 2 Result Link-3
30 నుంచే అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్లు
కాగా, జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షకు ఈ నెల 30 త తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తారు. మే 7 వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. అప్లికేషన్ ఫీజును మే 8 వ తేదీ వరకు చెల్లించవచ్చు. మే 29 నుంచి జూన్ 4 వ తేదీ వరకు అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్ష జూన్ 4 న జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు పేపర్ 1 , మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్ 2 ఉంటుంది. ఈ అడ్వాన్స్ డ్ ప్రాథమిక సమాధానాల కీ జూన 11 న రిలీజ్ చేస్తారు. జూన్ 18న ఫలితాలు విడుదల చేయనున్నట్టు ఐఐటీ గౌహతి విడుదల చేసిన షెడ్యూల్ లో ఉంది.
హైదరాబాద్ విద్యార్థికి 1st ర్యాంక్
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. హైదరాబాద్ కు చెందిన సింగారపు వెంకట్ కౌండిన్య అనే విద్యార్థి తొలి ర్యాంక్ ను సాధించాడు. ఈ విద్యార్థికి 300/300 మార్కులు స్కోర్ వచ్చింది. జూన్ లో జరిగే అడ్వాన్స్ డ్ మంచి ర్యాంక్ తెచ్చుకుని ఐఐటీ బాంబే లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతానని కౌండిన్య తెలిపాడు. కాగా, నెల్లూరు జిల్లాకు చెందిన పి. లోహిత్ ఆదిత్య సాయి 2వ ర్యాంక్ వచ్చింది. హైదరాబాద్ కు చెందిన సాయి దుర్గారెడ్డి 6 వ ర్యాంక్, అమలాపురానికి చెందిన కె. సాయినాథ్ శ్రీమంత 10వ ర్యాంక్ లు సాధించారు.