Site icon Prime9

JEE Advanced Exam: జేఈఈ అడ్వాన్స్ డ్ అడ్మిట్ కార్డులు విడుదల

JEE Advanced Exam

JEE Advanced Exam

JEE Advanced Exam: దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరం ఎంట్రన్స్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుదల అయ్యాయి. జూన్ 4 న జరిగే ఈ పరీక్షకు ఐఐఊ గౌహతి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జేఈఈ మెయిన్ లో అర్హత సాధించిన విద్యార్థులు అడ్వాన్స్ డ్ కోసం ఏప్రిల్ 30 నుంచి మే 7 వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇక జేఈఈ అడ్వాన్స్ డ్ లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కొక్కటి పేపర్ మూడు గంటలు జరగుతుంది. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు పేపర్ 2 జరుగుతుంది. విద్యార్థులు రెండూ పేపర్లు రాయాల్సి ఉంటుంది.

అడ్మిట్‌ కార్డుల కోసం క్లిక్‌ చేయండి

 

బాగా పెరిగిన దరఖాస్తులు

కాగా, జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించి అడ్వాన్స్‌డ్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఈ సారి బాగా పెరిగింది. దీంతో ఐఐటీ సీట్లకు పోటీ ఎక్కువైంది. ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీ కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. కొన్నేళ్లుగా అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే వారి శాతం తగ్గుతూ ఉంది. కానీ, ఈ సారి మాత్రం ఏకంగా 15 శాతం పెరిగింది. అత్యంత కఠినంగా భావించే అడ్వాన్స్‌డ్‌ రాసినా తాము నెగ్గలేమన్న ఆలోచనతో ఆ పరీక్ష రాసేందుకు వేలాది మంది విద్యార్థులు ముందుకు వచ్చేవారు కాదు. వారంతా జేఈఈ మెయిన్‌ ర్యాంకుతోనే ఎన్‌ఐటీల్లోనే చేరేలా నిర్ణయించుకుంటారు. గత ఏడాది దేశవ్యాప్తంగా 2.62 లక్షల మంది జేఈఈ మెయిన్‌లో అర్హత పొందారు.

 

అందులో 1.60 లక్షల మంది మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఈ సారి 2.50 లక్షల మంది అర్హత సాధించగా వారిలో ఏకంగా 1.90 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఈ పరీక్షకు 2014 నుంచి 2017 వరకు 77-81 శాతం మంది పోటీపడ్డారు. ఆ తర్వాతి నుంచి దరఖాస్తు చేసేకునే వారి శాతం తగ్గుతూ వచ్చింది. కరోనా కారణంగా 2021లో కేవలం 58.10 శాతం మందే పరీక్షకు రిజిస్ట్రర్ చేసుకున్నారు. గత ఏడాది కూడా 61 శాతం మంది అభ్యర్థులు ఇంట్రస్ట్ చూపారు. ఈ సారి అది 76 శాతానికి చేరుకుంది. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 30 వేల మంది పోటీపడనున్నారు. ఐఐటీల్లో 18 శాతం సీట్లను తెలుగు విద్యార్థులు కైవసం చేసుకుంటున్న విషయం తెలిసిందే.

 

Exit mobile version