Site icon Prime9

IIT Bombay: ఇకపై బీటెక్ లో బ్రాంచ్ మార్పు ఉండదు.. కేంద్రం కీలక ఆదేశాలు

IIT Bombay

IIT Bombay

IIT Bombay: చదువుల ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్న విద్యార్థులు ఎందరో. దీంతో విద్యార్థుల ఆత్మహత్యలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీటెక్‌ మొదటి ఏడాది పూర్తయ్యాక మెరిట్‌ తో సెకండ్ ఇయర్ లో కోరుకున్న బ్రాంచిలోకి మారే వెసులు బాటును రద్దు చేయాలని ఐఐటీలు, ఎన్‌ఐటీలను ఆదేశించింది. ఈ విధానాన్ని అమలు చేస్తూ ఐఐటీ బాంబే తాజాగా నిర్ణయం తీసుకుంది. ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ఇప్పటివరకు బీటెక్‌ తొలి ఏడాదిలో ఎక్కువ గ్రేడ్‌ పాయింట్లు సాధిస్తే రెండో ఏడాదిలో కోరుకున్న బ్రాంచ్ కు వెళ్లే అవకాశం ఉంది. అందు కోసం ప్రత్యేకంగా 10% సీట్లు కేటాయిస్తారు.

అయితే ఈ విధానానికి విపరీతమైన పోటీ ఉండటంతో కాలేజీల్లో చేరిన నాటి నుంచే విద్యార్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీంతో అనుకున్నది జరగకపోతే తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు చేసుకుంటున్నారు. అందుకే 2023-24 అకడమిక్ ఇయర్ నుంచి అలాంటి అవకాశాన్ని రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది.

గత నెలలో భువనేశ్వర్‌లో జరిగిన ఐఐటీ కౌన్సిల్‌ సమావేశంలో విద్యార్థుల ఆత్మహత్యల నివారణపైనే సుదీర్ఘంగా చర్చ జరిగింది. వాటిని ఆపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని.. ఒత్తిడికి ప్రధాన కారణమైన బ్రాంచ్ మార్పును రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆదేశాలు జారీ చేశారు. ‘విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు కేంద్రం ఆదేశించింది. బ్రాంచ్ మార్పును రద్దు చేయాలని పరోక్షంగా పరోక్షంగా చెప్పినా.. కొత్త విద్యా సంవత్సరంలో దాదాపు అన్ని ఐఐటీలు, ఎన్‌ఐటీలు అమలు చేస్తాయి’ ఎన్ఐటీ కి సంబంధించిన ఓ డైరెక్టర్‌ తెలిపారు.

 

తెలుగు విద్యార్థులపైనే అధికం(IIT Bombay)

దేశంలోని మొత్తం 23 ఐఐటీల్లోని 16,600 సీట్లలో 18% సీట్లను.. 31 ఎన్‌ఐటీల్లోని 24 వేల సీట్లలో 20% సీట్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులే సాధిస్తున్నారు. తెలుగు విద్యార్థుల్లో కంప్యూటర్‌ సైన్స్‌పై ఎక్కువగా క్రేజ్‌ అధికంగా ఉంది. అందువల్ల తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో మన విద్యార్థులపైనే ఎక్కువ ప్రభావం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

Exit mobile version