MBBS option in AIIMS: నీట్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. విద్యార్దులు కౌన్సిలింగ్ కు సిద్దమవుతున్నారు. వైద్యవిద్యకు సంబంధించి ప్రతిష్టాత్మక సంస్దలు ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.. (ఎయిమ్స్ ). వీటిలో ఢిల్లీలో ఎయిమ్స్ పాతది. మంచి ప్యాకల్టీ, సదుపాయాలు ఉన్న సంస్ద. ఇది కాకుండా ఇటీవల కాలంలో యూపీఏ, బీజేపీ ప్రభుత్వాల హయాంలో దేశంలో పలుచోట్ల ఎయిమ్స్ ప్రారంభించారు.అయితే కొత్తగా పెట్టిన ఎయిమ్స్ కు వెళ్లాలా వద్దా అనే సందేహంలో స్టూడెంట్స్ ఉన్నారు. దీనిపై ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్ సతీష్ ఎయిమ్స్ పై విద్యార్దులకు సూచనలు అందజేసారు.
కటాఫ్ ఎంత ఉంటుందంటే.. (MBBS option in AIIMS)
ఎయిమ్స్ ఢిల్లీ జనరల్ కేటగిరీ 55, ఓబీసీలకు 242,ఎస్సీ లకు 1000, ఎస్టీలకు 3000 ర్యాంకు కటాఫ్ గా ఉంటాయి. 1956 లో పెట్టిన సంస్ద. అత్యత్తమ ఫ్యాకల్టీ. మంచి ఆసుపత్రి, సదుపాయాలు ఉంటాయి. జోద్ పూర్, రిషికేష్, రాయబరేలి, పాట్నా తదితర ఎయిమ్స్ లో సీటు వస్తే మిస్సవద్దు. ఫీజు కూడా రీజనబుల్ గా ఉంటుంది. మంగళగిరి, బీబీనగర్, బిలాస పూర్ తదితర ఎయిమ్స్ ల విషయాని కొస్తే కొత్త క్యాంపస్ లు. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ, పేషెంట్లు, సదుపాయాల గురించి తెలుసుకుని ఆప్షన్ ఇవ్వడం మంచింది. ఎయిమ్స్ లో చదివితే పీజీ సీట్లలో కొంత అడ్వాంటేజి ఉంటుంది. టీచింగ్, మెధడాలజీ, ఫ్యాకల్టీ మిగతా కళాశాలల కన్నా తేడాగా ఉంటుంది. విదేశాల్లో పీజీ చేసినపుడు అడ్వాంటేజ్ ఉంటుంది. ఎయిమ్స్ లో కటాఫ్ ఓసీ కి 7నుంచి 11 వేలు, ఓబీసీలకు 10 వేల దాకా ఎస్టీలకు 1 లక్ష దాకా ర్యాంకు వచ్చే అవకాశముంది. అందువలన ఎయిమ్స్ కు ఆప్షన్ ఇచ్చేటపుడు ఆలోచించి ఇవ్వాలని సతీష్ చెబుతున్నారు. వీటికి సంబంధించి విద్యార్దులకు ఎటువంటి సందేహాలున్నా పూర్తి వివరాలకు డాక్టర్ సతీష్8886629883 ను సంప్రదించవచ్చు.