Prime9

CSAB Counselling: CSAB కౌన్సిలింగ్ – 2023 కు ఎలా సిద్దమవ్వాలంటే..

CSAB Counselling: దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు జోసా కౌన్సిలింగ్ పూర్తియింది. ఇపుడు CSAB కౌన్సిలింగ్ ప్రారంభమవుతోంది. దీనికి సంబంధించి జూలై 31 నుంచి ఆగష్టు 7 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. CSAB అంటే Central seat allocation board. జోసా కౌన్సిలింగ్ పూర్తయిన తరువాత మిగిలిన సీట్లను దీని ద్వారా భర్తీ చేస్తారు. ఇదివరకే ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీటు వచ్చిన వారు, సాంకేతిక నిబంధనల కారణంగా సీటు వచ్చి చేరలేకపోయిన వారు, ఎందులోనూ సీటు రాని వారు ఈ కౌన్సిలింగ్ కు హాజరుకావచ్చు.

నాలుగు రకాల ఆప్షన్స్..(CSAB Counselling)

ఈ కౌన్సిలింగ్ లో నాలుగు రకాల ఆప్షన్స్ ఉంటాయి. accept, surrender, withdrawl, exit అనే నాలుగు రకాల ఆప్షన్స్ ఉంటాయి. వీటని జాగ్రత్తగా ఉపయోగించాలి. ఫస్ట్ రౌండ్ అయిపోయిన తరువాత మరలా రౌండ్ కు వెళ్లడమా లేదా అన్నది అభ్యర్ది ఆలోచించుకోవాలి. జోసా కౌన్సిలింగ్ లో ఐఐటీలు కూడా పాల్గొంటాయి. CSAB కౌన్సిలింగ్ లో ఐఐటీలు మినహా మిగిలన సంస్దలన్నీ పాల్గొంటాయి. ఓసీ కేటగిరిలోమ లక్షకు పైగా ర్యాంకు వచ్చిన వారికి, ఎస్సీ, ఎస్టీ కేటగిరిలో రెండు లక్షలకు పైగా ర్యాంకు వచ్చిన వారికి కూడా సీటు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది కౌన్సిలింగ్ ను ఎన్ఐటీ రూర్కేలా నిర్వమిస్తోంది. ఫస్ట్ రౌండ్ రిజల్ట్ 11 వ తేదీన, సెకండ్ రౌండ్ రిజల్ట్ 17 వ తేదీన వస్తుంది. సీటు వచ్చిన కాలేజీకి స్వయంగా వెళ్లి రిపోర్టు చేయవలసి ఉంది. ఇంతకుముందు సీటు వచ్చినా తాజా సీటుతో అది క్యాన్సిల్ అయిపోతుంది. అందువలన విద్యార్దులు కంగారు పడకుండా నియమ నిబంధలన్నింటినీ జాగ్రత్తగా అర్దం చేసుకుని ఆప్షన్ ఇచ్చుకోవాలి. ఈ కౌన్సిలింగ్ కు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా విద్యార్దులు  ప్రముఖ విద్యానిపుణుడు డాక్టర్  సతీష్ 8886629883ను  సంప్రదించవచ్చు.

CSAB Counselling New Rules -2023 Lakhs లో Rank వచ్చినా కూడా Seat వచ్చే అవకాశం | Last Date: 7-08-2023

Exit mobile version
Skip to toolbar