MBBS Further Studies in Abroad: ఇండియాలో MBBS పూర్తయిన వెంటనే లైసెన్స్ ఇస్తారు. ఈ లైసెన్స్ తీసుకున్న తరువాత ఆసక్తి ఉన్న వారు ఇతర దేశాల్లో మెడిసిన్ లో పీజీ చేయవచ్చు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదం పొందిన కాలేజీలు 390 వరకూ ఉన్నాయి. ఈ కాలేజీల్లో మెడిసిన్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు విదేశాల్లో పీజీ చేయడానికి అర్హులు. అయితే పీజీలో ప్రవేశాలు ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటాయి. యూకే, జర్మనీ, చైనా, సింగపూర్ ఇలా ప్రతీ దేశం పీజీ ప్రవేశాలకు తమకంటూ ప్రత్యేకమైన విధానాలను రూపొందించుకున్నాయి. వీటికి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి.ఇంజనీరింగ్ అభ్యర్దుల మాదిరి ఒకే పరీక్షతో మెడిసిన్ అభ్యర్దులు పీజీ ప్రవేశాన్ని పొందలేరు. కొంతమందికి కొన్ని దేశాల్లో సీట్లు ఈజీగా వస్తాయి. మరికొంతమందికి కొన్ని దేశాల్లో సీట్లు రావడం కష్టం. అందువలన వీటికి సంబంధించిన నిబంధనలు పూర్తిగా అర్దం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్దులు వీటికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా ప్రముఖ విద్యానిపుణడు డాక్టర్ సతీష్ 8886629883 ను సంప్రదించవచ్చు.