Site icon Prime9

NEET 2023: “నీట్” గా సీటు వచ్చే ఛాన్స్.. ఈజీగా మెడిసిన్ విద్య అంటున్న డాక్టర్ సతీష్ కుమార్

NEET 2023

NEET 2023

NEET 2023: 12వ తరగతి తర్వాత నీట్ రాసి కౌన్సిలింగ్ సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేక చాలామంది విద్యార్థులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. నీట్ కౌన్సిలింగ్ సమయంలో విద్యార్థులు ఎలాంటి కోర్సులు ఎంచుకోవాలి.. తీసుకోవాల్సి జాగ్రత్తలు ఏంటి.. ఎలాంటి విద్యాసంస్థలు ఎంచుకోవాలి అనే దానిపై డాక్టర్ సతీష్ గారి సూచనలు సలహాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)పై తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో చాలా మందికి అనేక సందేహాలున్నాయి. ఎంబిబిఎస్, బిడిఎస్, కోర్సుల్లో చేరేందుకు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న విద్యార్థులపై నీట్ కు సంబంధించిన నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ కొన్ని వెసులుబాటులు కల్పించిందని ఆయన వివరించారు. ఎంతెంత ర్యాంకులు వస్తే ఏఏ కళాశాలల్లో సీటు వస్తుంది. ప్రభుత్వ కళాశాలాల్లో సీట్ రాకపోతే ఏఏ కళాశాలల్లో చేరాలి. అలా చేరితే ఎంత ఖర్చు అవుతుంది ఏ,బి క్యాటగిరీలు వాటి ఫీజులు ఎలా ఉన్నాయి అనేది డాక్టర్ సతీష్ కుమార్ ప్రైమ్ 9 న్యూస్ తో ఎక్స్‌క్లూసివ్ గా వెల్లడించారు.

NEET (UG) Rank విశ్లేషణ..! | NEET Qualify అయితే Seat పక్కా | Dr Satish | Prime9 Eduction

ఎంతెంత ర్యాంకు వస్తే ఎక్కడ సీట్(NEET 2023)

720 మార్కులకు నీట్ పరీక్ష. క్వాలిఫైయింగ్ మార్కులు 50 శాతం.. 720 మార్కులకు గత ఏడాది నీట్ కటాఫ్ 116 మార్కులుగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
700పైగా మార్కులు వస్తే 50 ర్యాంకు. ఎయిమ్స్ ఢిల్లీ లాంటి కళాశాల్లో సీటు వచ్చే ఛాన్స్
600 నుంచి 650 మార్కులు వస్తే 2వేల నుంచి 4000 వేల ర్యాంకు వచ్చే అవకాశం.. భారతదేశంలోని గవర్నమెంట్ కళాశాలల్లో సీట్ వచ్చే ఛాన్స్
500 నుంచి 550 మార్కులు వస్తే 50వేల ర్యాంకు వచ్చే అవకాశం. స్టేట్ గవర్నమెంట్లోని ప్రైవేట్ కళాశాల్లోని ‘ఏ’ క్యాటగిరిలో గవర్నమెంట్ ఫీజ్ తో మెడిసిన్ సీట్ వచ్చే అవకాశం.
300 నుంచి 450 మార్కులు వస్తే 1,25 వేల నుంచి 3లక్షలకుపైగా ర్యాంకు వచ్చే ఛాన్స్. ఏ స్టేట్ లో ఉన్న ‘బి’ క్యాటగిరిలో ఫీజు రూ.12 నుంచి రూ.13 లక్షల ఫీజు కట్టాల్సి ఉంటుంది.
ఇక 300నుంచి తక్కువ ర్యాంకు వస్తే డీమ్డ్ యూనివర్సీటీలకు వెళ్లాల్సి ఉంటుంది. వీరు రూ.15 నుంచి రూ. 20 లక్షల ఫీజు కట్టాల్సి ఉంటుందని డాక్టర్ సతీష్ వెల్లడించారు.

నీట్ పరీక్ష లేదా ఉన్నత విద్యా సంస్థల్లో చేరాలి అనుకునే వారు మరియు సలహాలు, సూచనలు కోరే వారు.. ఉన్నత విద్యను టాప్ కాలేజీల్లో చదివి కెరీర్ ని ఉజ్వలంగా మార్చుకోవాలని అనుకునే వారు.. పూర్తి వివరాల కొరకు కెరీర్ గైడెన్స్ వారిని సంప్రదించగలరు 8886629883..

Exit mobile version
Skip to toolbar