GATE Answer Key 2023 : గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) 2023 ఆన్సర్ కీ ని ఐఐటీ కాన్పూర్ మంగళవారం (ఫిబ్రవరి 21) విడుదల చేసింది. ఫిబ్రవరి 21, సాయంత్రం 5 గంటల నుంచి గేట్ 2023 ఆన్సర్ కీ అధికారిక వెబ్ సైట్ gate.iitk.ac.in లో అందుబాటులో ఉంచారు.
గేట్ 2023 రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ gate.iitk.ac.in లో ఆన్సర్ కీని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
అదే విధంగా గేట్ రాసిన అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు ఆన్ లైన్ లో పెట్టవచ్చు.
అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి ఉద్దేశించిన లింక్ కూడా అధికారిక వైబ్ సైట్ లో ఉంచారు.
గేట్ 2023 ఫలితాలు మార్చి 21న విడుదల అవుతాయి. గేట్ 2023 ను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గా ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో ఐఐటీ కాన్పూర్ నిర్వహించింది.
కీ ఎలా చూసుకోవాలంటే(GATE Answer Key 2023)
గేట్ 2023 కి సంబంధించిన అధికారిక వెబ్ సైట్ gate.iitk.ac.in ఓపెన్ చేయాలి.
ఎన్ రోల్ మెంట్ ఐటీ లేదా ఈ మెయిల్ ఐడీ, పాస్ వర్డ్ లను ఎంటర్ చేసి, చిన్న ఆర్థిమెటిక్ ఎక్స్ ప్రెషన్ ను సాల్వ్ చేసి లాగిన్ కావాలి.
గేట్ ఆన్సర్ కీ మీ స్క్రీన్ పై కనిపిస్తుంది.
ఆన్సర్ కీ ని చెక్ చేసుకుని, డౌన్ లోడ్ చేసుకోవాలి.
సైన్స్ అండ్ టెక్నాలజీ స్ట్రీమ్స్ లోని గ్యాడ్యుయేట్స్ కోసం జాతీయ స్థాయిలో గేట్ పరీక్షను నిర్వహిస్తారు.
గేట్ స్కోర్ కార్డ్ రిజల్ట్ ప్రకటించిన తేదీ నుంచి మూడు సంవత్సరాల పాటు చెల్లుతుంది.