Site icon Prime9

GATE 2023 Results: గేట్ ఫలితాలు విడుదల.. ఎలా చెక్ చేసుకోవాలంటే..

GATE 2023 Results

GATE 2023 Results

GATE 2023 Results: ప్రముఖ ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ప్రఖ్యాత ఇంజినీరింగ్‌ విద్యా సంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌- 2023 (గేట్ 2023) ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ పరీక్ష ఫలితాలను గురువారం సాయంత్రం ఐఐటీ కాన్పూర్‌ అధికారులు విడుదల చేశారు.

ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్‌ చేసి ఫలితాలు(GATE 2023 Results) చెక్‌ చేసుకోవచ్చు.

అయితే, పెద్ద ఎత్తున అభ్యర్థులు ఒక్కసారిగా ఫలితాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించడంతో సాంకేతిక కారణాలతో సర్వర్‌లో సమస్యలు తలెత్తి అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు.

స్కోర్‌ కార్డులు మాత్రం ఈ నెల 21 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

 

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి 

గేట్‌ పరీక్షలో సాధించిన స్కోరుతో దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశంతో పాటు నెలనెలా స్కాలర్ షిప్ పొందొచ్చు. ఈ స్కోరు పీహెచ్‌డీ ప్రవేశాలకూ ఉపయోగపడుతుంది.

కొన్ని పబ్లిక్‌, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాల కోసం ఈ స్కోరు ప్రామాణికంగా తీసుకుంటుంటారు.

ఇంత ప్రాముఖ్యమున్న గేట్‌ పరీక్షను ఈ ఏడాది కేంద్ర విద్యాశాఖ తరఫున 29 సబ్జెక్టుల్లో ఐఐటీ కాన్పూర్‌ పరీక్ష నిర్వహించింది.

గత ఏడాది ఆగస్టు 30 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్‌ 7వరకు కొనసాగింది. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 4,5 11,12 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు.

ఆన్సర్‌ కీని ఫిబ్రవరి 21న విడుదల చేసిన అధికారులు అభ్యంతరాల స్వీకరణకు 22 నుంచి 25 వరకు అవకాశం కల్పించారు.

విద్యార్థులు గేట్‌ పరీక్షలో సాధించిన స్కోరు ఫలితాల వెల్లడి నుంచి 3 సంవత్సరాల పాటు వర్తిస్తుంది.

 

Exit mobile version